సుశాంత్ కేసులో మరో ట్విస్ట్…మేనేజర్ ఆత్మహత్యతో 14 కోట్ల డీల్ ఆగిపోయిందని?

సుశాంత్ కేసులో మరో ట్విస్ట్…మేనేజర్ ఆత్మహత్యతో 14 కోట్ల డీల్ ఆగిపోయిందని?

by Megha Varna


సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.అయితే సుశాంత్ మరణంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.కాగా బాలీవుడ్ ప్రముఖులే సుశాంత్ మరణానికి కారణం అంటూ బాలీవుడ్ అంతటా చర్చలు జరుగుతున్నాయి.అయితే సుశాంత్ సన్నిహితులను పోలీస్ లు విచారించడం మొదలుపెట్టారు.కాగా సుశాంత్ మేనేజర్ కూడా తాజాగా ఆత్మహత్య చేసుకోవడంతో మరిన్ని అనుమానాలు వెలువడుతున్నాయి.ఆ వివరాల్లోకి వెళ్తే .

దిశా సాలియన్ ఎప్పటినుండో సుశాంత్ కు మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు.సుశాంత్ సినిమాలకు సంభందించిన విషయాలను అలాగే ఆర్ధిక లావాదేవీలను దిశా సాలియన్ చూసుకునేవారు.అయితే ఆ వెబ్ సిరీస్ లో నటించేందుకు గాను 14 కోట్ల రూపాయల పారితోషకంతో సుశాంత్ నటించేలా ఒక డీల్ ను కుదిర్చే ప్రయత్నం చేసారు దిశా సాలియన్.అయితే ఆమె జూన్ 18 వ తారీఖున ఆత్మహత్య చేసుకోవడంతో ఈ డీల్ మధ్యలోనే ఆగిపోయింది.

అయితే ఎప్పటినుండో డిప్రెషన్ తో బాధపడుతున్న సుశాంత్ కు దిశా మరణం మరింత కృంగదీసింది.కాగా దిశా మరణం తర్వాత సుశాంత్ ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ధ్రువీకరించారు.అయితే దిశా ,సుశాంత్ మధ్య ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదని పోలీస్ ల విచారణ లో వెలుగులోకి వచ్చింది.కాగా సుశాంత్ మరణానికి గల కారణాలను వెలికితీసే పనిలో పోలీసులు బిజిగా ఉన్నారు.

You may also like