సుశాంత్ ది హత్యే అని చెప్పడానికి 13 కారణాలు ఇవే- క్రిమిన‌ల్ లాయ‌ర్.!

సుశాంత్ ది హత్యే అని చెప్పడానికి 13 కారణాలు ఇవే- క్రిమిన‌ల్ లాయ‌ర్.!

by Mohana Priya

Ads

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ లో ఆత్మహత్య చేసుకున్నా దాని వెనక ఎన్నో కారణాలు ఉన్నాయని జనాలు అంటున్నారు. తర్వాత ఎంతోమంది బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీని వెనకాల పెద్ద బాలీవుడ్ ప్రొడ్యూసర్ల హస్తం ఉంది అని సుశాంత్ ది ఆత్మహత్య కాదని, అతని కావాలనే చాలామంది కలిసి మానసికంగా వేధించారని దాంతో బాధపడిన అతను ఇలా చేయాల్సి వచ్చింది అని అన్నారు.

Video Advertisement

దీనికితోడు మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ కూడా ఆత్మహత్య వెనుక వృత్తిపరమైన శత్రుత్వం ఉంది అని తాము దర్యాప్తు చేస్తామని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తల ప్రకారం సుశాంత్ ది నిజంగా ఆత్మహత్య కాదు ఏమో అనిపిస్తుంది. ఒక అడ్వకేట్ సుశాంత్ ది ఆత్మహత్య అయ్యే అవకాశమే లేదని అందుకు ఇవే రుజువులు అని ఈ విధంగా చెప్పారు.

#1. క్రిమినల్ లా ప్రకారం మామూలుగా ఈత వచ్చిన ఏ మనిషి కూడా బలవంతంగా నీటిలో దూకి ఆత్మహత్య చేసుకోలేరట. చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నం విరమించుకునే అంత బుద్ధిబలం ఉంటుందట. అదేవిధంగా తన శరీరాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తికి ఉరి వేసుకోవడానికి ప్రయత్నించినా చివరి నిమిషంలో వెనకడుగు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

#2. సుశాంత్ చనిపోవడానికి కారణం ఊపిరాడకపోవడం. ఎవరైనా ఊపిరాడకుండా చేసి తర్వాత ఉరివేసి అది ఆత్మహత్యగా చిత్రీకరించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. దాంతో పోలీసులు ఒకవేళ దర్యాప్తు చేసినా ఉరి వేసుకొని కనిపించాడు కాబట్టి ఊపిరి ఆడక పోవడానికికారణం ఉరి వేసుకోవడం అని నిర్ధారించి కేసు మూసేస్తారు.

#3. సినిమా అవకాశాలు రావట్లేదు అందుకే చనిపోవడానికి ప్రయత్నించాడు అని అన్నా అది కూడా తప్పే. ఎందుకంటే దర్శకుడు ఆనంద్ గాంధీ ఇర్ఫాన్ ఖాన్ ని దృష్టిలో పెట్టుకొని ఎమర్జెన్స్ అనే కథను తయారు చేసుకున్నారు. ఇర్ఫాన్ చనిపోయిన తర్వాత సుశాంత్ ని ఇర్ఫాన్ స్థానంలో తీసుకున్నారు. ఇంకా రూమీ జాఫ్రీ దర్శకత్వం వహిస్తున్న ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం కూడా లాక్ డౌన్ తర్వాత మొదలు పెడదామని నిర్ణయించుకున్నారు.అలాగే ఆస్కార్ విజేత అయిన రసూల్ పోకుట్టి దర్శకత్వంలో కూడా సినిమా చేయడానికి అంగీకరించాడు.

#4. సుశాంత్ చనిపోయే వారం రోజుల ముందే తనకి మేనేజర్గా కొంతకాలం పనిచేసిన దిశ తన బిల్డింగ్ లోని 14 వ అంతస్తు నుండి దూకి చనిపోయారు. తన ఇద్దరు మిత్రులు అయిన మ‌న్మీత్ గ్రెవాల్, ప్ర‌కాష్ మెహ‌తా కూడా కొంతకాలం క్రితమే చనిపోయారు. ఒక రిపోర్టర్ వారిని కూడా ఆత్మహత్య అని వీళ్ళ మరణానికి ఒకదానితో ఒకదానికి సంబంధం ఉందని చెప్పినా కూడా, ఈ విషయాన్ని సమర్థించే విధంగా ఏ ఒక్క రుజువు లేదా పాయింట్ కూడా దొరకలేదు.

#5. సుశాంత్ కు ఉరి వేసుకున్న తర్వాత చూసిన వ్యక్తులు ముగ్గురే. సుశాంత్ కర్టెన్ తో ఉరివేసుకున్నాడు అని చెప్పారు. కానీ సుశాంత్ గొంతు మీద ఉన్న ముద్రలు చూస్తే ప్లాస్టిక్ తాడు ముద్రల లాగా ఉన్నాయి.

#6. పోలీసులు చెప్పిన దాని ప్రకారం సుశాంత్ తొమ్మిది గంటలకి అతని సోదరి తో మాట్లాడాడు. సుశాంత్ ఇంట్లో పనిచేసే వ్యక్తులు చెప్పిన ప్రకారం తను తొమ్మిదిన్నరకి తన గదిలో నుండి బయటికి వచ్చి దానిమ్మ పండు జ్యూస్ తాగి లోపలికెళ్లిపోయి ఉరి వేసుకున్నాడు.

#7. మామూలుగా ఆలోచిస్తే అసలు బాధలో ఉన్న వ్యక్తి జూస్ తాగడానికి మాత్రమే ప్రత్యేకంగా బయటికి వచ్చి తాగేసి వెళతాడా? లేదా జ్యూస్ తాగిన వెంటనే అప్పటివరకు మామూలుగానే ఉన్న వ్యక్తికి హఠాత్తుగా ఇలాంటి ఆలోచన వచ్చిందా? వెటకారపు ప్రశ్నలు అని కోపం తెచ్చుకోకుండా వాళ్లు చెప్పిన మాటల ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి మీరే ఆలోచించండి.

#8. ఇది సుశాంత్ చనిపోయిన తర్వాత నుండి వినిపిస్తున్న రూమర్ లలో ఒకటి ఇది నిజమో కాదో తెలియదు కానీ తన పరిస్థితిని వివరించడానికి ఈ కారణాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్ ప్రకారం దిల్ బేచారా సుశాంత్ చివరి సినిమా అని. తర్వాత తను సీరియల్స్ లో వెబ్ సిరీస్ లో నటించాలి అని. తనని సినిమాల నుండి బ్యాన్ చేశారు అని అంటున్నారు. ఈ రూమర్ సృష్టికర్త కమాల్ ఆర్ ఖాన్.

#9. అందరూ అతను నిజాలు బాహాటంగా మాట్లాడుతాడు కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా నిజమే అన్నారు. కానీ ఒక్కసారి అతని ముందు ట్వీట్ లని చూస్తే అన్నీ సుశాంత్ కి విరుద్ధంగానే ఉన్నాయి. సుశాంత్ ఒక ఫెయిల్డ్ యాక్టర్ అని. అప్పుడు తన బ్రేక్ అప్ అవ్వడం అంతా ఎంఎస్ ధోని సినిమా హిట్ అవడానికి చేసిన ఒక పబ్లిసిటీ స్టంట్ అని.సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని. ఇలా చాలా చేశాడు. దీన్నిబట్టి ఒక్కసారి ఆలోచిస్తే ఇలా సినిమాల్లో నుండి బ్యాన్ చేయడం కూడా నిజమో కాదో అనిపిస్తుంది.

#10. సుశాంత్ తన కుటుంబంతో తరచుగా మాట్లాడుతూనే ఉండేవాడు. ముందు రోజు రాత్రి తన దగ్గర మిత్రులతో ఒక చిన్న పార్టీ ఏర్పాటు చేశాడు. అతను చనిపోవడానికి డిప్రెషనే కారణమా అన్న దానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఒకవేళ ఉన్నా సుశాంత్ చనిపోవడానికి కారణం అయిన వ్యక్తి ఆ ఆధారాన్నే కారణంగా మార్చి ఉండొచ్చు.

#11. సుశాంత్ ఏ విషయం అయినా అంత సులువుగా వదలడు అని. ఓటమిని అంత తొందరగా అంగీకరించే వ్యక్తి కాదు అని అసలు ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదు అని ఎవరో కచ్చితంగా మర్డర్ చేసి ఉంటారు అని మాజీ ఎంపీ పప్పుయాదవ్ అన్నారు. సుశాంత్ అంకుల్ కూడా సుశాంత్ ది కచ్చితంగా హత్యే అని, ముంబై పోలీసులు ని నమ్మడానికి వీలులేదు అని ఎందుకంటే వాళ్ళకి పెద్ద పెద్ద బాలీవుడ్ సెలబ్రిటీలతో సంబంధాలు ఉండొచ్చు అని అన్నారు.

#12. చనిపోయిన స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని. ఒకవేళ ఆ వ్యక్తి  చనిపోవాలి అని ముందే నిర్ణయించుకుంటే తన భావాలను వ్యక్తపరచకుండానే చనిపోతాడా అన్న సందేహం కూడా వస్తోంది.

#13. తను చిచోరే మూవీ లో ముఖ్య పాత్రలు చేశాడు అని ఆ మూవీ ఆత్మహత్యలు అనేది జీవితంలో వచ్చే సమస్యలకు పరిష్కారం కాదు అనే సందేశం ఇస్తుంది అని అందరికీ తెలిసిన విషయమే.

#14. సుశాంత్ కి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. తన సోదరి కూడా ఇదే మాట అన్నారు. సుశాంత్ సోదరికి సుశాంత్ మనసు సరిగ్గా ఉండట్లేదు అన్న విషయం తెలుసు కానీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడు అని ఊహించలేదు అని చెప్పారు. కానీ అసలు ఆ నిర్ణయం సుశాంత్ తీసుకున్నాడో లేదో. ఎవరికి తెలుసు?

#15. తన మేనేజర్ చనిపోయిన తర్వాత, డైరెక్టర్ ఇంకా రైటర్ అయిన రూమీ జాఫ్రీ సుశాంత్ కి జాగ్రత్తగా ఉండమని చెప్పారట. అందుకు సుశాంత్ త్వరలోనే కలుద్దాం సార్ అని బదులు ఇచ్చాడట. ఇలాగే సుశాంత్ తన స్నేహితుల కొంతమందితో తొందరలో కలుద్దాం అని రిప్లై ఇచ్చాడట. అలా మాట్లాడిన వ్యక్తి ఆత్మ హత్య చేసుకుంటాడు అనే మాట నమ్మబుద్ధి కావటం లేదు, బహుశా నిజం కాకపోవచ్చు అని అంటున్నారు.

ఇవి ప్రస్తుతానికి విచారించాల్సిన విషయాలు. ఏది నిజమో ఏది అబద్ధమో పోలీసుల దర్యాప్తు తర్వాతే తేలుతుంది.


End of Article

You may also like