Ads
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే.అయితే సుశాంత్ మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు…సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రబోర్తి ని విచారణకు కు పిలిచారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఆ విచారణలో రియా పలు సంచలన విషయాలను తెలిపారు. అవేంటో చూద్దాం.
Video Advertisement
చాలాకాలం నుండి సుశాంత్ తో రిలేషన్ లో ఉంటున్నాను అని రియా తెలిపారు. మేము ఇద్దరం నవంబర్ 2020 లోపు ఒక ప్రాపర్టీ కొనుక్కొని పెళ్లి చేసుకుందాం అని నిశ్చయించున్నామ .కానీ కొద్ది రోజుల క్రితమే మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ జరిగిన తర్వాత నుండి సుశాంత్ చనిపోయే ముందు రోజు వరకు కూడా సుశాంత్ తో కాంటాక్ట్ లో ఉన్నట్లు రియా తెలిపారు.
సుశాంత్ చనిపోయే కొన్ని గంటల ముందు కూడా రియా కి కాల్ చేసారు అని సుశాంత్ కాల్ డేటాలో తెలిసింది.రియా చక్రబోర్తి మొబైల్ నుండి సుశాంత్ కు సంభందించిన కొన్ని ఫోటోలు ,వీడియోలు అలాగే టెక్స్ట్ మెసేజ్ లు కలెక్ట్ చేసుకున్నారు ముంబై పోలీసులు.సుశాంత్ ప్రవర్తన ఈ మధ్యకాలంలో మారిపోయింది అని రియా చక్రబోర్తి అన్నారు.సుశాంత్ కొంతకాలం నుండి డిప్రెషన్ లో ఉన్నారని అయితే మెడికేషన్ తీసుకోవడానికి నిరాకరించారని రియా అన్నారు. యోగ ,మెడిటేషన్ చెయ్యమని సుశాంత్ కు చెప్పానని రియా అన్నారు.
End of Article