Ads
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తన స్నేహితులను, కుటుంబసభ్యులనే కాదు అభిమానులను కూడా దిగ్బ్రాంతికి గురిచేసింది.. సుశాంత్ తో తమకున్న బంధంగురించి ప్రతి ఒక్కరూ తమతమ ఫీలింగ్స్ ని సోషల్ మీడియాలో శేర్ చేసుకుంటున్నారు.. ఈ నేపధ్యంలో బాలివుడ్ నిర్మాత సందీప్ ,సుశాంత్ ఫ్రెండ్ తనతో ఉన్న అనుబంధం గురించి, అంకిత-సుశాంత్ ల బంధం గురించి తన ఇన్స్టాలో శేర్ చేసారు.
Video Advertisement
“ప్రియమైన అంకిత, ప్రతి రోజు గడిచేకొద్దీ, ఒక ఆలోచన నన్ను పదే పదే వెంటాడుతూనే ఉంటుంది. కాష్ …మనం చాలా ప్రయత్నించాం..అతన్ని ఆపడానికి, మనం అతన్ని వేడుకున్నాం కూడా.. మీ ఇద్దరి బ్రేకప్ అప్పుడు కూడా నువ్వె చాలా బాధపడ్డావు..అతడి కోసం ప్రెయర్ చేసావు.మీ ఇంటి నేమ్ ప్లేట్ నుండి నువ్ ఇంకా సుశాంత్ పేరు తీసేయలేదు. నీ ప్రేమ ప్రత్యేకమైనది అంటూ అంకితనుద్దేశించి పోస్ట్ చేశారు సందీప్..
అదే పోస్టులో వారి ముగ్గురి బంధంగురించి కూడా రాసారు..మనం ముగ్గురం కలిసి లోకండ్ వాలా ఇంట్లో గడిపిన రోజులు నేనెప్పటికి మర్చిపోలేను..కలిసి వండుకోవడం,కలిసి తినడం, మనం వెళ్లిన లాంగ్ డ్రైవ్ లు..మనం చేసిన అల్లరి ఏదీ నేను మర్చిపోలేదు.. నాకు ఆ రోజులు కావాలి,మనం ముగ్గురం కలిసి సంతోషంగా ఉన్నరోజులు కావాలి అంటూ తన జ్ణాపకాల్ని నెమరువేసుకున్నరు.
సుశాంత్ ముఖం మీద చిరునవ్వు తీసుకురావడానికి నువ్ పడిన తాపత్రయం.. నువ్ మాత్రమే తనకు సరైన జోడి..నువ్ తనకు ప్రేయసి మాత్రమే కాదు, వైఫ్,తల్లి,ఫ్రెండ్ అన్ని నువ్వే..నువ్వు మాత్రమే తనని రక్షించగలిగి ఉండేదానివి..తను నీతో ఉండుంటే అంటూ అంకిత గురించి చెప్తూ నీ స్నేహం ఎప్పటికి ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ ముగించాడు సందీప్ సింగ్..
నిర్మాత సందీప్ సింగ్,అంకిత ,సుశాంత్ ల స్నేహం ఇప్పటిది కాదు..వాళ్లు పవిత్ర రిష్తా సీరియల్ చేస్తున్నప్పటి నుండి వీరి ముగ్గురి మద్య స్నేహం ఉంది..ఆ స్నేహం రోజురోజుకి పెరుగుతూ వచ్చింది..ప్రస్తుతం సుశాంత్ ఆత్మహత్య తర్వాత అంత్యక్రియల వరకు సుశాంత్ కుటుంబానికి తోడుగా నిలిచారు సందీప్ సింగ్..
End of Article