Ads
జబర్దస్త్ షో ద్వారా బుల్లితెరపై పరిచయం అయ్యి వెండితెరకు పరిచయం అయినవాళ్ళు చాలామందే ఉన్నారు.అయితే కొంతమంది సినిమా అవకాశాల కోసం జబర్దస్త్ కు దూరం అయినవాళ్లు కూడా ఉన్నారు.కాగా ఇటీవల చమ్మక్ చంద్ర జబర్దస్త్ షో వదిలేసి జీ తెలుగు అదిరింది షో కి వెళ్లారు.అయితే అదిరింది షో కి వెళ్లినందుకు గాను చమ్మక్ చంద్ర బరిపారితోషకం తీసుకుంటున్నారని తెలుస్తుంది.ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
చమ్మక్ చంద్ర తెలుగు ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.చమ్మక్ చంద్ర ఎక్కువగా ఫామిలీ స్కిడ్స్ చెయ్యడం వలన అన్ని వర్గాల ప్రేక్షకుల మన్ననలు పొందారు.చమ్మక్ చంద్ర చేసిన పాత స్కిడ్స్ నేటికీ బుల్లితెరమీద అలాగే యూట్యూబ్ లో కూడా చాలామంది వీక్షిస్తున్నారు.అయితే చమ్మక్ చంద్ర జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఒక్కో కాల్షీట్ కు 2 .5 లక్షల రూపాయలు తీసుకునేవారంట.అయితే ఇప్పుడు జబర్దస్త్ మానేసి అదిరింది ప్రోగ్రాం కు వెళ్లడం వలన ఒక్కో కాల్షీట్ కు దాదాపు 5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారంట చమ్మక్ చంద్ర.
జబర్దస్త్ మానేసి అదిరింది ప్రోగ్రాం కు ఎందుకు వెళ్లారు అని చమ్మక్ చంద్ర ను చాలామంది నెటిజన్లు ప్రశ్నించారు.అయితే నాగబాబు గారు ఇచ్చిన హామీ కారణంగా జబర్దస్త్ షో మానేసి అదిరింది షో కి వెళ్లినట్లుగా చమ్మక్ చంద్ర చెప్పారు.అయితే ప్రస్తుతం అదిరింది షో కి కూడా ప్రేక్షకాదరణ బాగా పెరిగింది.కాగా చమ్మక్ చంద్ర అదిరింది షో లో కూడా తన మార్క్ కామెడీ ని పండిస్తున్నారు.
End of Article