ఆ కారణం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు…సుశాంత్ సైక్రియార్టిస్ట్‌ చెప్పిన సంచలన విషయాలివే.!

ఆ కారణం వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు…సుశాంత్ సైక్రియార్టిస్ట్‌ చెప్పిన సంచలన విషయాలివే.!

by Mohana Priya


సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయినప్పటి నుంచి రోజుకో కథనం వినిపిస్తూనే ఉంది. ఒకసారి తను డిప్రెషన్లో ఉన్నందువల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అని. ఒకసారి తనకి ఆఫర్లు లేకపోవడమే తన ఆత్మహత్యకు కారణమని. ఇంకోసారి అసలు తనది ఆత్మహత్యే కాదు ఎవరో హత్య చేశారు అని ఇలా రోజుకో విషయం బయట పడుతోంది. దాంతో అసలు విషయం తెలుసుకోవడానికి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు సుశాంత్ సన్నిహితులు అందర్నీ విచారిస్తున్నారు. ఇటీవల సుశాంత్ సైకియాట్రిస్ట్ కెర్సి బి చవ్డా ని పోలీసులు విచారించారు. దాంతో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అంకిత తో బ్రేకప్ అయిన విషయాన్ని  సుశాంత్ తట్టుకోలేక పోయాడు. దాంతో మానసికంగా చాలా బాధ పడ్డాడు. కెర్సి మాట్లాడుతూ “అంకిత తనని ఇష్టపడిన అంతగా ఇప్పటివరకు ఎవరూ ఇష్టపడలేదు అని ఇంక ఎవరూ ఇష్టపడలేరు అని చాలా సార్లు చెప్పాడు.

రాత్రిళ్లు నిద్ర పోయేవాడు కాదు. ఎంతో ఒత్తిడికి గురయ్యాడు. తర్వాత కృతి సనన్ తో స్నేహం చాలా బలపడింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్నేహం ముందుకు సాగలేదు. తర్వాత ఒక దర్శకుడి కూతురిని ఇష్టపడ్డాడు. అది కూడా విఫలమైంది. తర్వాత రియా తో సన్నిహితంగా ఉండేవాడు. కానీ తర్వాత తర్వాత రియా ప్రవర్తనవల్ల సుశాంత్ ఆనందంగా ఉండేవాడు కాదు” అని చెప్పారు. ఈ విషయాన్నీ సోనమ్ మహాజన్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు.

2016లో సుశాంత్ అంకిత తో కొన్ని కారణాల వల్ల విడిపోయారు. విడిపోయిన తర్వాత కూడా సుశాంత్ అంకిత తమ స్నేహాన్ని కొనసాగించారు. సుశాంత్ అంత్యక్రియలకు కృతి సనన్, శ్రద్ధా కపూర్, రియా చక్రవర్తి హాజరయ్యారు. అంత్యక్రియలు పూర్తయిన మరుసటి రోజు అంకిత సుశాంత్ ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

You may also like