Ads
కరోనా కారణంగా రోజుకో చిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చి అంతటా వైరల్ గా మారుతుంది.అయితే శ్రీకుకాలం జిల్లా టెక్కెలి మండలంలో ఓ డ్రెస్ జిప్ కారణంగా కరోనా పాజిటివ్ ఉన్నట్లుగా గుర్తించారు.అయితే డ్రెస్ జిప్ ద్వారా కరోనా ఎలా బయట పడింది అనే అంశం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయింది.వివరాల్లోకి వెళ్తే …
Video Advertisement
శ్రీకాకుళం టెక్కిలి మండలానికి చెందిన ఓ కుటుంబం హైదరాబాద్ కు పని నిమిత్తం వలస వచ్చి హైదరాబాద్ లోనే చాలా కాలం నుండి నివసిస్తున్నారు.అయితే కొన్ని రోజుల క్రితం ఆ కుటుంబంలో ఉన్న నాలుగేళ్ళ చిన్నారి ఏదో మింగేశాడు.దీంతో ఆ పిల్లవాడికి నొప్పి తీవ్రం అవ్వడంతో ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు.కానీ ఆసుపత్రివారు పరీక్షించి ఏమి లేదు అని చెప్పడంతో వారు ఇంటికి వచ్చేసారు.అయితే పిల్లవాడికి అంతకంతకు నొప్పి తీవ్రం అవ్వడంతో మళ్ళీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.దీంతో ఈసారి ఆసుపత్రి సిబ్బంది డిజిటల్ ఎక్స్ రే తీశారు.దీంతో గొంతులో ఉన్న జిప్ కనిపించింది.
అయితే ఆ జిప్ తియ్యాలి అంటే ఆపరేషన్ చేసి తియ్యాలని డాక్టర్లు స్పష్టం చేసారు.కాగా ఆపరేషన్ చేసేముందు కరోనా పరీక్షా నిర్వహించారు ఆ చిన్నారికి.దీంతో ఆ చిన్న పిల్లాడి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.దీంతో ఆ చిన్న పిల్లాడి కుటుంబ సభ్యులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు.కాగా ఆ చిన్న పిల్లాడి తండ్రికి నెగిటివ్ గా నిర్దారణ అయింది కానీ తల్లి కి మాత్రం పాజిటివ్ గా నిర్దారణ అయింది.దీంతో టెక్కెలి లోని గొల్లవీధిలోను అలాగే ఆ చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను నిర్బంధించి రెడ్ జోన్ గా ప్రకటించారు.ఆ ప్రాంతమంతా కూడా క్లోరినేషన్ స్ప్రే చేసారు.
End of Article