Ads
కోవిడ్ -19తో చాలా మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి.. లాక్ డౌన్ ఎఫెక్ట్ మొదట పడింది స్కూల్స్ పైనే..దాంతో స్కూల్స్ మూసేశారు.. ఇప్పట్లో స్కూల్స్ ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు.. మూడు నెలలుగా ఉద్యోగాలు లేక ,జీతాలు లేక అనేక మంది ప్రైవేట్ టీచర్లు రోడ్డున పడ్డారు..మొన్నటికి మొన్న ఒక టీచర్ అరటి పండ్లు అమ్ముకుంటూ బతుకు వెళ్లదీస్తుంటే..ఇప్పుడు మరో టీచర్ ఇడ్లీల బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు..
Video Advertisement
ఖమ్మంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో ప్రిన్సిపల్ గా పనిచేసేవాడు రాంబాబు..నెలకు 22000 జీతం.. స్కూల్స్ బంధ్ అవ్వడంతో యాజమాన్యం జీతం కట్ చేసింది.. మళ్లీ స్కూల్ ఓపెన్ అయ్యేవరకు జీతాలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసింది..దాంతో ఒక్కసారిగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి.. ఎలాగోలా సర్దుకుందాం అంటే ఒంటరి కాదు..భార్య పిల్లలు ఉన్నారు..చేసేదేం లేక భార్యపిల్లల పోషణకు ఏదో ఒకటి చేసి తీరాలని.. 2000రూపాయలు పెట్టి తోపుడు బండిపెట్టుకుని ఇడ్లీలు అమ్మాలని నిర్ణయించుకున్నడు..
భర్త నిర్ణయంతో భార్య తాను కూడా సాయం చేస్తానంది.. ఇద్దరూ ఉదయం పూట ఇడ్లీలు అమ్ముతున్నారు..కరోనా కారణంగా బయట టిఫిన్స్ తినడానికి వచ్చే సంఖ్య అంతంత మాత్రంగా ఉండడంతో ఖర్చులు పోను రోజుకు 200వరకు వస్తున్నాయిని అన్నారు రాంబాబు..నెల్లూరు వెంకటేశ్వరావు అరటి పండ్లు అమ్ముకోవడం చూసి పూర్వ విద్యార్ధులు సాయం చేశారు..నల్గొండలో ఒక టీచర్ ఉపాది కూలిగా మారాడు..మరికొందరు డెలివరీ బాయ్స్ గా మారారు..ఇప్పుడు రాంబాబు..ప్రిన్సిపల్ గా పనిచేసిన రాంబాబుని ఇలా చూసిన వారు ఏమనుకుంటారు అనే ఆలోచన లేకుండా తన పని తాను చేసుకుంటున్నారు.. తప్పదు కుటుంబాల కంటే పేరు ముఖ్యం కాదు కదా..
End of Article