Ads
కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.అయితే కరోనా ను అదుపు చెయ్యాలంటే సామజిక దూరం పాటించడంతో పాటు మాస్క్లు,శానిటైజర్ వాడడం తప్పనిసరి అని తెలిసి అన్ని దేశాలు కూడా ఈ విధానాన్నే అవలంబిస్తున్నాయి.అయితే శానిటైజర్ రాసుకుని గుడికి వచ్చిన ఓ భక్తుడిని అడ్డగించి బయటకు పంపించేశాడు ఓ పూజారి.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
కరోనా వైరస్ నేపథ్యంలో హ్యాండ్ కి శానిటైజర్ రాసుకోవడం తప్పనిసరి అయిపోయింది అని అందరికి తెలిసింది.కాగా ప్రబుత్వాలన్నీ కూడా శానిటైజర్ వాడమని చెప్తూ వస్తున్నాయి.అయితే ఈ శానిటైజర్ అనేది వైరస్ ను నిరోధించడంలో సహాయపడుతుంది అని విషయం అందరికి తెలిసిందే.కాగా శానిటైజర్ ను ఆల్కహాల్ బేస్ తో తయారుచేస్తున్నారు.అయితే ఒక భక్తుడు శానిటైజర్ రాసుకుని గుడికి వెళ్ళాడు.అయితే అక్కడ ఉన్న పూజారి శానిటైజర్ వాసనా ను గమనించి గుడికి ఇలా అపవిత్రంగా వస్తావా నీకు దర్శనం లేదు బయటకు పో అని బయటకు పంపించేశాడు.
అప్పడు ఆ వ్యక్తి నన్ను బయటకి పంపించడానికి గల కారణం ఏంటి అని ఆ భక్తుడు పూజారి ని అడిగాడు.అప్పుడు ఆ పూజారి స్పందిస్తూ..మద్యం తాగి గుడికి రాకూడదనే విషయం అందరికి తెలుసు కదా అలాంటింది మద్యం తో తయారు అయిన శానిటైజర్ రాసుకొని గుడికి రావడం అంతే తప్పు కదా అని అన్నారు.అయితే ఈ విషయం ఆలయంలోని వేరే వారి ద్రుష్టి కి వెళ్లడంతో వారు ఆ భక్తుడిని అనుమతించమని ఆ పూజారికి చెప్పారు.అయినా ఆ పూజారి ఆ భక్తుడిని దర్శనం చేసుకోనివ్వకపోవడంతో ఆలయంలోని పెద్దలు ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.
End of Article