Ads
సుశాంత్ సింగ్ రాజపుట్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు అనే విషయం తెలిసిందే.కాగా సుశాంత్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యకమవుతూ రోజుకో కొత్త కధనం వినపడుతుంది.అయితే సుశాంత్ మరణం వెనకాల కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉంది అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
సోనమ్ కపూర్ పోస్ట్ లకి సోషల్ మీడియా లో నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.సోనమ్ కపూర్ పోస్ట్ ల కింద కామెంట్లతో ఆడుకుంటున్నారు నెటిజన్లు.మీ తండ్రి అనిల్ కపూర్ లేకపోయి ఉంటె నువ్వు అసలు హీరోయిన్ వి అయ్యిదానివి కాదు అంటూ ఎక్కువమంది నెటిజన్లు కామెంట్స్ చేసారు.దీంతో సోనమ్ కపూర్ కామెంట్ల బాధ తట్టుకోలేక తన కామెంట్ సెక్షన్ ఆఫ్ లో పెట్టుకున్నారు.ఆమె కామెంట్స్ సెక్షన్ ఆఫ్ లో పెట్టుకుంది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
ఈ నేపథ్యంలో ఫాథర్స్ డే సందర్భంగా అనిల్ కపూర్ ఫోటో ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నా తండ్రి వలనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను.చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా డబ్బు,పేరు ,హోదా అని నా తండ్రే నాకు ఇచ్చారు అని సోనమ్ రాసారు.అనిల్ కపూర్ నాకు తండ్రి కావడం నా అదృష్టం అని అన్నారు సోనమ్ కపూర్.
End of Article