Ads
ఈమధ్య కాలంలో భారత్ చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.భారత్, చైనా సరిహద్దు అయిన గాల్వాన్ లోయలో భారత్ ,చైనా మధ్య యుద్ధం జరిగి భారత్ సైనికులు 20 మంది చనిపోయారు.అయితే ఎంతో చలిగా ఉన్న వాతావరణంలో చాలా ఇరుకుగా ఉన్న చిన్న నదిలో ఈ యుద్ధం జరగడం వలన 20 మంది భారత్ సైనికులు చనిపోయారని తెలుస్తుంది.అయితే యుద్ధం వద్దు ఇక్కడ నుండి సరిగా వెళ్ళిపోండి అని భారత్ సైనికులు చెప్తున్నా వినకుండా చైనా సైనికులు దూసుకుని వచ్చి యుద్ధ వాతావరణం నెలకొల్పారు.ఆ వివరాలేంటో చూద్దాం ..
Video Advertisement
ఇండియా టుడే కధనం ప్రకారం ..అయితే గాల్వాన్ లోయలో యుద్ధ వాతావరణం తర్వాత భారత్ చైనా మధ్య కొన్ని చర్చలు జరుగుతున్నాయి .అయితే ఈ సమయంలో మాస్క్లు పెట్టుకున్న చైనా సైనికులు బోర్డర్ లో ఇండియా సైనికులతో గొడవ పెట్టుకున్న 5 నిమిషాల నిడివి గల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల అయ్యింది.చైనా సైనికులు యుద్ధం చెయ్యడానికి సిద్ధం అవుతుండగా భారత్ సైనికులు యుద్ధం వద్దు సామరస్యంగా వెళ్లిపోండి అని చెప్తున్నట్లుగా మనం ఆ వీడియోలో చూడచ్చు.
అయితే యుద్ధం వద్దు అని చెప్పినా వినకుండా వచ్చిన చైనా సైనికులకు భారత్ సైనికులు సరైన సమాధానం చెప్పడం మనకి ఆ వీడియో లో కనపడుతుంది.అయితే ఈ ఘటన ఏ ప్రాంతంలో జరిగిందో స్పష్టంగా తెలియకపోయిన కొంతమంది నిపుణులు మాత్రం సిక్కిం లో ఈ ఘటన జరిగి ఉండచ్చు అని చెప్తున్నారు.గడిచిన 40 యేళ్లలో ఎప్పుడూ లేనంతగా చైనా ,భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఇప్పుడు వెలుగులోకి వస్తున్నా వీడియోలతో చైనా భారత్ మీద ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో ,ఎలాంటి కుట్ర పన్నుతుందో తెలుస్తుంది.ఇప్పటిదాకా భారత్ లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా పలు ప్రయత్నాలు చేసింది.
#IndiaChinaFaceOff | India-China video war peaks; new brawl video surfaces. @GauravCSawant joins in with more details.#5iveLive with @ShivAroor LIVE at https://t.co/4fqxBVUizL pic.twitter.com/6hQmd4xs0J
— IndiaToday (@IndiaToday) June 22, 2020
End of Article