Ads
కరోనా వైరస్ ను అదుపు చేసేందుకు ఎంతో కష్టపడుతున్న విషయం తెలిసిందే.రోజురోజుకి కేసులు పెరుగుతుండడంతో అందరిలోనూ బయాందోళనలు నెలకొన్నాయి.అయితే ప్రపంచ దేశాలతో పాటు కరోనా ను అదుపు చెయ్యడంలో పాకిస్తాన్ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది.అయితే తాజగా పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ కరోనా గురించి తప్పు సమాచారాన్ని ప్రజలలోకి తీసుకెళ్లారు.కాగా ఈ విషయం అంతటా వైరల్ గా మారింది..ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ఒక నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న పాకిస్తాన్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ జారతాజ్ గుల్ మాట్లాడుతూ …
“కోవిడ్ 19 లో 19 అంటే కరోనా అనేది 19 రకాల లక్షణాలు కలిగి ఉంది అని ఒక్కో దేశాన్ని ఒక్కో రకంగా ఈ కోవిడ్ ప్రభావితం చేస్తుంది అని అన్నారు.వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం కోవిడ్ 19 లో కో అంటే కరోనా అని ,వి అంటే వైరస్ అని ,డి అంటే డిసీస్ అని.”
అని ఆమె అన్నారు. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎన్నో ట్రోల్ల్స్ వచ్చాయి. కరోనా వైరస్ గురించి పాకిస్తాన్ లో తప్పు సమాచారం అందించడం ఇది మొదటిసారి కాదు .
ఇంతక ముందు పాకిస్తాన్ కు చెందిన మతపరమైన వ్యక్తి కూడా ఇలానే తప్పు సమాచారాన్ని ప్రజలలోకి తీసుకెళ్లారు.కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కు చెందిన మతపరమైన వ్యక్తి ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహనా కల్పిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఎక్కువగా పడుకుంటే కరోనా వైరస్ రాదు అని మనం పడుకుంటే కరోనా వైరస్ కూడా పడుకుంటుంది అని ఆ మతపరమైన వ్యక్తి చెప్పడం మనం వీడియోలో చూడచ్చు.అయితే ఇప్పటిదాకా పాకిస్తాన్ లో 1 ,71 ,666 కేసులు నమోదు కాగా 3 ,382 మంది మృతి చెందారు.
#COVID19 has 19 points applicable to countries based on their immunity level, reveals Federal Minister for Climate Change Zartaj Gull #CoronaVirusPakistan pic.twitter.com/WNy0kOUpgh
— Murtaza Ali Shah (@MurtazaViews) June 20, 2020
End of Article