Ads
చిన్నపిల్లలు దేవుడితో సమానమని అందరూ అంటూ ఉంటారు.చిన్నపిల్లలకి ఆకలి వేసిన,ఏదైనా బాధ కలిగిన నోటితో చెప్పలేరు కాబట్టి ఏడుస్తూనే ఉంటారు.ఆలా చిన్నపిల్లలు ఏడుస్తున్న సమయంలో తల్లితండ్రులు వారి బాధను అర్ధం చేసుకొని పాలను ఇవ్వడమో,ఎత్తుకొని ఆడించడంలాంటివో చేస్తూ ఉంటారు.అయితే చిన్నపిల్ల ఏడ్చి డిస్టర్బ్ చేస్తుంది అని కన్నతండ్రే చంపేశాడు.వివరాల్లోకి వెళ్తే …
Video Advertisement
కేరళలోని ఎర్నాకులానికి చెందిన ఓ వ్యక్తి రెండు నెలలు నిండిన తన కుమార్తె ను తీవ్రంగా గాయపరిచాడు. .అయితే గాయపడిన కుమార్తె ను ఆసుపత్రికి తీసుకువెళ్లి మంచం మీద నుండి పడిపోయింది అని డాక్టర్లకు చెప్పాడు ఆ వ్యక్తి.అయితే అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించగా తానే మద్యం మత్తులో ఇలా చేసినట్లు ఒప్పుకున్నాడు.
రాత్రంతా ఏడుస్తూ ఇబ్బంది పెడుతుంది అనే కారణంతోనే ఇలా చేసినట్లు ఆ వ్యక్తి పోలీసులకు వెల్లడించాడు.అయితే ఆ చిన్నారికి తలలో తీవ్రంగా రక్తస్రావం జరగడం వలన డాక్టర్లు సర్జరీ చేసారు.కాగా ఆ చిన్నారి ఇంకా ఐసియు లోనే వుండి చికిత్స పొందుతుంది.కనీసం మూడు నెలలు కూడా లేని చిన్నారి మీద కన్నతండ్రే ఇలా దాడి చెయ్యడం చాలా దారుణం అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
End of Article