Ads
గత మూడు నెలల నుండి సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించిన ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో కొన్ని సడలింపులతో లాక్ డౌన్ ను ఎత్తివేసాయి.దీంతో సినిమా ,సీరియల్ షూటింగ్ లను కూడా అతితక్కువ మందితో జరుపుకోవచ్చని ప్రభుత్వాలు అనుమతిని ఇచ్చాయి.అయితే మూడు నెలల నుండి సీరియల్స్ ఎక్కడివి అక్కడ ఆగిపోవడంతో ఎంతో శరవేగంగా టీవీ సీరియల్స్ షూటింగ్ ని ఆరంభించారు.అయితే ప్రముఖ సీరియల్ నటుడు ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో మళ్ళీ సీరియల్ షూటింగ్స్ ఆగిపోయాయి.ఆ వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిని ఇవ్వడంతో కొన్ని రోజుల క్రితమే టీవీ షూటింగ్స్ మొదలయ్యాయి.అయితే షూటింగ్ కోసం తిరుపతి నుండి హైదరాబాద్ వచ్చారు ప్రభాకర్.జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్ తో ప్రేక్షకులకు సుపరిచితులు ప్రభాకర్.అయితే షూటింగ్ సమయంలో జ్వరంతో బాధపడుతున్న ప్రభాకర్ కు కరోనా టెస్ట్ నిర్వహించారు.దీంతో ప్రభాకర్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.
దీంతో సీరియల్ వర్గాలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.అయితే మిగతా టీవీ షూటింగ్స్ కూడా ఆపివేయాలని టీవీ యూనియన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తుంది.షూటింగ్ మొదలైన కొన్ని రోజులలోనే ఇలా జరగడం బాధాకరమని టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు అంటున్నారు.ఈ కరోనా భయం వలనే షూటింగ్స్ కు అనుమతిని ఇచ్చిన ఇంకా పెద్ద హీరోలు ఎవరూ కూడా షూటింగ్స్ మొదలుపెట్టలేదు.
End of Article