Ads
ప్రపంచంలోని అన్ని దేశాలను కరోనా వైరస్ వణికిస్తుందన్న విషయం తెలిసిందే.రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడంతో అందరిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి.అయితే కరోనా పేషెంట్స్ ఐసొలేషన్ వార్డ్స్ నుండి పారిపోవడం ఇప్పటిదాకా మనం చాలానే చూసాం.అయితే ఒక ఆసుపత్రి లో ఏకంగా 70 మంది కరోనా పేషెంట్స్ మాయమయ్యారు.కాగా ఈ విషయం దేశమంతటా సంచలనం గా మారింది.వివరాల్లోకి వెళ్తే ..
Video Advertisement
ముంబై లైవ్ కధనం ప్రకారం..ముంబై లోని మలాద్ ప్రాంతంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి.దీంతో ఆసుపత్రిలో చేరే కరోనా పేషెంట్స్ ఎక్కువ అయిపోయారు.కాగా అధికారులు కరోనా పేషెంట్స్ డేటా ను పరిశీలించారు.దీంతో దాదాపు 70 మంది కరోనా పేషెంట్స్ ఆసుపత్రి నుండి తప్పించుకున్నారని తెలిసింది.దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు పోలిసులకు సమాచారం అందించారు.
కాగా తప్పించుకున్న పేషెంట్స్ ఇంటి అడ్రస్ కి వెళ్లి వారి ఫోన్ నెంబర్ కి కాల్ చెయ్యడం మొదలుపెట్టారు.అయితే చాలామంది ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి పైగా వారు ఇచ్చిన అడ్రస్ లో వారు లేరు.దీంతో వారిని వెతికి పట్టుకునే పనిలో పోలీసులు బిజిగా ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఐఎంఈఐ నెంబర్ ద్వారా బాధితులను పట్టుకుంటామని పోలీసులు చెప్తున్నారు.
End of Article