ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఇంతలా ఎలా మారిపోయింది..?

ఈమె ఎవరో గుర్తుపట్టారా? ఇంతలా ఎలా మారిపోయింది..?

by Megha Varna

Ads

బరువు ఎక్కువగా ఉండేవాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం.బరువు ఎక్కువగా ఉన్నామంటూ బాధపడే సామాన్య ప్రజలు ఉన్నారు అలాగే సెలబ్రెటీలు కూడా ఉన్నారు .అయితే బరువు ఎక్కువగా ఉన్నవాళ్లు సమాజంలో ఎన్నో బాడీ షేమింగ్ కామెంట్స్ ఎదుర్కొంటు బాధపడుతూ ఉంటారు.అయితే నటి విద్యుల్లేఖ రామన్ కూడా ఇలాంటి అనుభవాలని ఎదుర్కొన్నారు.అయితే ఇలా అందరూ చేసిన కామెంట్స్ ను పట్టుదల గా తీసుకుని కష్టపడి బరువు తగ్గి అందరిముందుకు ఎంతో కాంఫిడెన్స్ తో వచ్చారు నటి విద్యుల్లేఖ రామన్.

Video Advertisement

విద్యుల్లేఖ రామన్ ఇప్పటిదాకా ఎన్నో తెలుగు సినిమాలో కీలక పత్రాలు పోషించి ప్రేక్షకుల మన్ననలు పొందారు.అయితే “ధ్రువ “, “భాగమతి” చిత్రాలతో ఎక్కువమంది ప్రేక్షకులకు గుర్తుండిపోతారు విద్యుల్లేఖ రామన్.అయితే ఎక్కువ బరువు ఉన్న కారణంగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాని అందుకే ఎలా అయిన బరువు తగ్గాలని నిర్ణయించుకున్నని విద్యుల్లేఖ రామన్ అన్నారు.

.అయితే కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఎన్నో వ్యాయామాలు చేసి నాజూకుగా తయారయ్యారు విద్యుల్లేఖ రామన్.కాగా తన తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసారు విద్యుల్లేఖ రామన్. అతి తక్కువ సమయంలో విద్యుల్లేఖ రామన్ సన్నగా మారిపోయారని నిజంగా చాలా గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై విద్యుల్లేఖ రామన్ స్పందిస్తూ ..లావుగా ఉండీ ఎలా కాంఫిడెన్స్ గా ఉంటున్నారు అని నన్ను గతంలో చాలామంది అడిగారు.

అయితే ఇప్పుడు లావు తగ్గినందుకు ఇంకా కాంఫిడెన్స్ గా ఉన్నాను.నేను ఏదైతే జీవితంలో కష్టం అని అనుకున్నానో అది సాధించాను కాబట్టి అని అన్నారు విద్యుల్లేఖ రామన్.సరైన ఆహారం ,క్రమం తప్పకుండ వ్యాయామం చేస్తే ఎవరైనా బరువు తగ్గచ్చు అని అంటున్నారు విద్యుల్లేఖ రామన్.అయితే బరువు తగ్గే సమయంలో క్రమశిక్షణతో ఉంటూ ప్రతీరోజు వ్యాయామం చెయ్యాలి అని విద్యుల్లేఖ రామన్ అన్నారు.ప్రస్తుతానికి నా బరువు 68 కేజీలు అని తెలిపారు విద్యుల్లేఖ రామన్ .


End of Article

You may also like