Ads
కరోనా వైరస్ నేపథ్యంలో అన్నింటిలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి.ఆన్ లైన్ విద్యాతరగతులు ,ఇంటి వద్ద కొంతమంది ఉద్యోగులకు పని ,కొంతమంది మాత్రమే ఆఫీస్ లో పని చెయ్యాలని ఇలా చాలా మార్పులు కరోనా వలన సంభవించాయి.అయితే వచ్చే నెల అంటే జూన్ 1 తారీకు నుండి బ్యాంకు కు సంభందించిన కొన్ని నిబంధనలు మారనున్నాయి.ప్రతీ ఒక్క బ్యాంకు ఖాతాదారుడు తెలుసుకోవలసిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
బ్యాంకు లో వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ నుండి ఎటిఎం లో క్యాష్ తీసుకునేవరకు చాలా మార్పులు అమలులోకి రానున్నాయి.బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నవారికి ఇకనుండి వడ్డీ శాతం తగ్గించేలా కనిపిస్తుంది.ఇప్పటికే పంజాబ్ నేషనల్ బ్యాంకు తమ బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నవారికి ౦.5 శాతం వడ్డీరేట్లు తగ్గించనున్నట్లు ప్రకటించింది.అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం జులై 1 వ తారీఖు నుండి అమలులోకి రాబోతుంది అని ఇప్పటికే తెలిపింది.
అయితే కరోనా వైరస్ వలన ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఎటిఎం లోనుండి క్యాష్ తీసుకున్నందుకు గాను చార్జెస్ ఏమి ఉండవని అలాగే బ్యాంకు లో మినిమమ్ బాలన్స్ మైంటైన్ చెయ్యకపోయినా చార్జెస్ ఏమి ఉండవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు.అయితే నిర్మలా సీతారామన్ తీసుకున్న నిర్ణయం కరోనా నేపథ్యంలో గడిచిన మూడు నెలలకే పరిమితం అని తెలుస్తుంది.అంటే జులై 1 వ తారీఖు నుండి ఎటిఎం చార్జెస్,మినిమమ్ బాలన్స్ చార్జెస్ మాములే అని అర్ధం అవుతుంది.
End of Article