ఇటీవల కాలంలో భార్య భర్తల మధ్య అభిప్రాయం బేధాలు రావడం ఆ తర్వాత డివోర్స్ తీసుకోని విడిపోవడం చాలా సర్వసాధారణం.అయితే కొన్నిసార్లు భార్య,భర్తల గొడవలు చంపేదాకా లేదా చంపుకునేదాకా వెళ్తున్నాయి.కాగా బెంగుళూర్ కు చెందిన ఓ చార్టెడ్ అకౌంటెంట్ తన భార్యను మరియు అత్తను చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.వివరాల్లోకి వెళ్తే …
బెంగుళూర్ లోని ఓ ప్రముఖ కంపినీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు అమిత్ అగర్వాల్ అనే వ్యక్తి.అయితే వీరికి వివాహం అయ్యి 12 యేళ్లు గడుస్తుంది.కాగా అమిత్ అగర్వాల్ దంపతులకు ఓ పది సంవత్సరాల కొడుకు కూడా ఉన్నాడు.అయితే గత కొంతకాలంగా అమిత్ అగర్వాల్ కు తన భార్యకు మధ్య కొన్ని గొడవలు జరుగుతున్నాయి.అయితే వీరిద్దరూ కలిసి బ్రతకడం కష్టం అని భావించి విడాకుల కోసం కోర్ట్ ను ఆశ్రయించారు.అయినా వీరి మధ్య గొడవలు ఎక్కువ అవ్వడంతో అమిత్ అగర్వాల్ తన భార్య ను చంపేశాడు.
ఆ తర్వాత నేరుగా విమానంలో తన అత్తగారు నివసించే కలకత్తా కు వెళ్ళాడు.అమిత్ అగర్వాల్ తన అత్తగారి ఇంటికి చేరుకోగానే అత్తమామలతో గొడవ పెట్టుకోవడం మొదలుపెట్టాడు .ఆ గొడవ ఉద్రిక్తం అవ్వడంతో తన దగ్గర ఉన్న గన్ తో తన అత్తను కాల్చి చంపేశాడు అమిత్ అగర్వాల్.దీనితో తీవ్ర భయబ్రాంతులకు లోనయ్యారు అమిత్ మామగారు.కాగా ఇంటికి బయట గెడ పెట్టి పక్కింటివారి సహకారంతో పోలీసులకు సమాచారం అందించారు.అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తలుపు తెరిచి చూసేటప్పిటికి అమిత్ కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయి కనిపించాడు.
కాగా ఘటన స్థలంలో ఒక ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఆ లేఖలో తన భార్య ను కూడా చంపేసినట్లు అమిత్ పేర్కొన్నాడు.దీంతో కలకత్తా పోలీసులు బెంగుళూర్ పోలీసులకు సమాచారం అందించడంతో బెంగుళూరు పోలీసులు అమిత్ భార్య మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు.ఈ మొత్తం ఘటనలో అమిత్ 10 యేళ్ళ కొడుకు మాత్రం తల్లితండ్రులు లేకుండా అన్యాయం అయిపోయాడు.