Ads
బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజపుట్ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు అనే విషయం తెలిసిందే.సుశాంత్ మరణం అటు బాలీవుడ్ తో పటు ఇతర చిత్రపరిశ్రమలలో కూడా కలకలం రేపుతోంది.అయితే సుశాంత్ ఎప్పటినుండో ఫడ్జ్ అనే శునకాన్ని ఎంతో ప్రేమగా పెంచుకున్నారు.అయితే సుశాంత్ మరణించిన తర్వాత ఫడ్జ్ కూడా బెంగ పెట్టుకుని చనిపోయింది అనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.ఆ వివరాలేంటో చూద్దాం …
Video Advertisement
సుశాంత్ రాజపుట్ కు ఫడ్జ్ అంటే ఎంతో ప్రేమ ఉండేది.గతంలో ఫడ్జ్ తో గడిపిన అనేక సంతోషమైన సంఘటనలను సుశాంత్ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.అయితే సుశాంత్ మరణించిన తర్వాత నుండి ఫడ్జ్ గోడమీద ఉన్న సుశాంత్ ఫోటో చూస్తూ ఆహారం ఏమి తీసుకోవడం లేదని కొన్ని వార్తలు వచ్చాయి.
అంతే కాకుండా చాలా రోజుల నుండి ఆహారం తీసుకోకపోవడం వలన ఫడ్జ్ మరణించింది అని వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.అయితే ఫడ్జ్ గురించి సుశాంత్ సన్నిహితులను అడగగా అలాంటిది ఏమి లేదని ఫడ్జ్ ఆరోగ్యంగానే ఉంది అని కాకపోతే సుశాంత్ మరణించినప్పటి నుండి ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని తెలిపారు.
End of Article