Ads
పరీక్షల్లో మీరు ఫెయిల్ అయ్యారు అని బాధపడుతుంటే మీ స్నేహితులు వచ్చి తనకి అన్ని సబ్జెక్టులు క్లియర్ అయ్యాయని కానీ టాపర్ అవ్వలేదు అని బాధగా ఉంది అని చెప్తే ఎలా అనిపిస్తుంది? వాళ్లను చూసి కోపం తెచ్చుకోవాలో లేదా మనకి వాళ్ళ బాధలు చెప్తున్నందుకు ఓదార్చాలో, లేదా మీరే సబ్జెక్ట్ పోయింది అని బాధలో ఉంటే అలా వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నందుకు తిట్టి అవతలకి పంపించెయ్యాలో ఏం అర్థం కాదు కదా? ఒక్కసారి ఇప్పుడు జపాన్ పడుతున్న బాధలను వింటే కచ్చితంగా పైన చెప్పిన ఉదాహరణే గుర్తొస్తుంది.
Video Advertisement
అందరికీ ఒక బాధ అయితే జపాన్ ది వేరే బాధ అన్నట్టు ఉంది పరిస్థితి. ప్రపంచం మొత్తం ఎక్కడికి కదలలేక, అటు ఆర్థికంగా ఇటు మానసికంగా ఎన్నో ఇబ్బందులను అనుభవిస్తున్న సమయంలో జపాన్ కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది.జపాన్ లో ఇప్పుడు కరోనా పేషెంట్లే లేరు అని బాధ పడుతున్నారట.
కోపం వస్తుంది కదా? ఇప్పుడు ఒక్కసారి పైన చెప్పిన ఉదాహరణ మళ్లీ చదవండి. అందులోని మీరు అంటే మిగిలిన దేశాలు. మీ స్నేహితులు అంటే జపాన్. ఒకసారి వివరాలలోకి వెళితే.ఇప్పుడు జపాన్ లో అసలు కరోనా పాజిటివ్ ఉన్న ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొంచెం ఆశ్చర్యంగా అనిపించినా కూడా ఇదే నిజం. అలా పాజిటివ్ నమోదైన పేషెంట్లకు కూడా వైద్యం చేసి డిశ్చార్జ్ చేసేసారు.
తర్వాత కూడా ప్రజలు ఎంతో క్రమశిక్షణగా మాస్కులు ధరించి సామాజిక దూరం పాటిస్తూ ఉండటంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవ్వలేదు. దాంతో మిగిలిన దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా గానీ జపాన్ మాత్రం కరోనా తర్వాత కూడా అభివృద్ధి చెందుతూనే ఉంది.
ఇప్పుడు కోవిడ్ 19 కోసం ప్రపంచ వ్యాప్తంగా 12 వ్యాక్సిన్ లకు ట్రైల్స్ జరుగుతున్నాయి. అందులో జపాన్ చేయాల్సినవి 6 ట్రైళ్ళు. అవిగన్ అనే వ్యాక్సిన్ ను ఇప్పటికే భారత్ రష్యా దేశాలు ట్రైల్ పూర్తి చేసి ఆమోదించాయి. దాంతో జపాన్ కూడా అవిగన్ (ఫావిపైరవిర్) తో తమ ట్రైల్ ను పూర్తిచేయాలని ఆ దేశ అధ్యక్షుడు షింజో అబే ఆదేశించారు.
కానీ అసలు పేషెంట్లే లేకపోవడంతో ట్రయిల్ టెస్టులు చేయడానికి కుదరట్లేదు. ట్రయిల్ అవ్వకుండా వ్యాక్సిన్ ని ఆమోదించే అవకాశం లేదు. దాంతో జపాన్ లోని స్థానిక ఫార్మా కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఆమోదించిన మెడిసిన్ ని జపాన్ లో ఆమోదించక పోవడం చాలా బాధాకరంగా ఉంది అని అంటున్నారు.
ఇంకొక విషయం ఏంటి అంటే జపాన్ లో కోవిడ్ 19 కి 54 ట్రయిల్ల్స్ కి అనుమతి ఉన్నా కానీ కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్ల పేర్లు చాలా తక్కువగా నమోదవడం వలన ట్రయిల్ టెస్టులు జరపడం ఎలా అనే ఆలోచనలో ఉన్నారు. అసలే వేరే దేశాల్లో పేషెంట్లు ఎక్కువైపోయి ఈ వ్యాధిని ఎలా అదుపు చేయాలో తెలియక, ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటే ఇప్పుడు జపాన్ ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మిగిలిన దేశాల ప్రభుత్వాలకి పుండు మీద కారం చల్లినట్టు అనిపిస్తుంది.
End of Article