Ads
మోడల్ గా పరిచయం అయ్యి తర్వాత హీరోయిన్ గా మారిన నటులు చాలామందే ఉన్నారు.అయితే రవిబాబు దర్శకత్వం వహించిన అవును చిత్రంలో నటించిన పూర్ణ కూడా ఇదే కోవకు చెందుతారు.ఈమధ్యకాలంలో హీరోయిన్ పూర్ణ పై ఓ నలుగురు సోషల్ మీడియాలో అసభ్యమైన పోస్ట్లు పెడుతూ పూర్ణ ను డబ్బులు ఇవ్వలసిందిగా డిమాండ్ చేసారు.ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం ..
Video Advertisement
కేరళ కు చెందిన పూర్ణ మొదటగా “శ్రీ మహాలక్ష్మి” చిత్రంతో పరిచయం అయినా అవును చిత్రంతో ప్రేక్షకులందరికీ గుర్తిండిపోతారు.ఈమధ్య కాలంలో సినిమా ఆఫర్స్ లేక ఖాళీగానే ఉన్నారు పూర్ణ.దీంతో ఎప్పటినుండో పూర్ణ కు పెళ్లి చెయ్యాలని చూస్తున్నారు పూర్ణ కుటుంబ సభ్యులు.అయితే ఈ సమాచారం తెలుసుకున్న నిందితులు పెళ్లి సంబంధం ఉంది అంటూ పూర్ణ ఇంటికి చేరుకొని పూర్ణ పర్సనల్ నెంబర్ కూడా తీసుకున్నారని సమాచారం.అయితే నిందితులు పూర్ణ మీద సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్లు పెడుతూ వచ్చారు. ఇలాంటి పోస్ట్లు ఆపాలంటే మేము కోరినంత డబ్బులు ఇవ్వాలని లేకపోతె ని కెరీర్ నాశనం చేస్తామని పూర్ణ ని బెదిరించారు నిందితులు.
అయితే మొదట నుండి అవి అన్ని భరిస్తూ వస్తుంది పూర్ణ.కానీ ఈ మధ్య వారి ఆగడాలు మరి శృతి మించడంతో పోలీసులను ఆశ్రయించారు పూర్ణ.దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం నిందితులు బెంగుళూరు నుంచి ఆన్లైన్ లో పోస్ట్ చేసారని తెలుసుకున్న స్థానిక పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.నిందితులు బెంగుళూర్ కు చెందిన అష్రాఫ్ ,శరత్,రఫీక్,రమేష్ అని పోలీసులు వెల్లడించారు.ఈ నలుగురి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చెయ్యడం ప్రారంభించారు పోలీసులు.అయితే ఈ నలుగురు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
End of Article