Ads
ఎన్నో ఏళ్ల నుంచి కలరిజం మీద జరుగుతున్న పోరాటానికి తమ వంతు మద్దతిస్తూ ఇటీవల హిందుస్థాన్ యూనిలీవర్ ఫెయిర్ అండ్ లవ్లీ లో నుండి ఫెయిర్ ని తీసేసింది. ఫెయిర్ అండ్ లవ్లీ వాళ్ళ నిర్ణయం ఈ ఉద్యమానికి కొంత ఉత్సాహాన్నిచ్చింది. కానీ రంగుకి ప్రాముఖ్యత ఇచ్చే రంగాలు ఇంకా చాలా ఉన్నాయి.
Video Advertisement
అందులో ఒకటి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్. అందులో కూడా షాదీ డాట్ కాం అనే వెబ్సైట్ ముందుకు వచ్చి వాళ్ళ దాంట్లో ఉన్న కలర్ ఫిల్టర్ని తీసేసింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు వారి తప్పుని తెలుసుకోవడం వెనక కూడా ఒకళ్ళు ఉన్నారు. తనే మేఘన్ నాగ్‌పాల్.
టొరంటో కి చెందిన మేఘన్ షాదీ డాట్ కామ్ లో ఒక యూజర్. తను ఆ వెబ్ సైట్ లో ఉన్న కలర్ ఫిల్టర్ చూసి షాక్ అయ్యింది. ఈ జనరేషన్లో కూడా ఇలా ఆలోచించే వాళ్లు ఉంటారా? అని అనుకుంది. వెబ్సైట్ వాళ్లకి ఆ ఆప్షన్ ని తీసేయమని మెయిల్ పెట్టింది.
దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం ఇంకా షాకింగ్ గా ఉంది. అది ఏంటంటే మేఘన్ పంపిన మెయిల్ కి వెబ్ సైట్ వాళ్ళు ఆప్షన్ తీయడం కుదరదు అని ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఈ ఆప్షన్ కి ప్రాముఖ్యత ఇస్తున్నారు అని చెప్పారు.
ఇదంతా మేఘన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మేఘన్ చేసిన పోస్ట్ డల్లాస్ కి చెందిన హేతల్ లఖానీ దృష్టిలో పడింది. మేఘన్ చెప్పిన మాటలని ఏకీభవిస్తూ హేతల్ కలర్ ఫిల్టర్ తీసేయమని ఆన్లైన్ పిటిషన్ తయారు చేసింది. ఆ పిటిషన్ సోషల్ మీడియా అంతా కార్చిచ్చులా పాకింది. 14 గంటల వ్యవధిలో దాదాపు 1500 మందికి పైగా ఈ పిటిషన్ మీద సైన్ చేశారు.
ఇదంతా 80 వేల మంది ఫాలోవర్లు ఉన్న బ్లాగర్ రోషిని పటేల్ చూసింది. షాదీ డాట్ కామ్ వెబ్ సైట్ వాళ్లకి ఇదంతా అగౌరవపరిచే ఎలాగా ఉంది అని, ఇంక ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళని చూసి భవిష్యత్తు తరాల వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? అని ట్వీట్ చేసింది.
దానికి షాదీ డాట్ కాం వాళ్లు తాము ఎవరినీ వాళ్లకి ఎలాంటి రంగు వాళ్ళు కావాలి అనేది అడగమని ప్రేమకి రంగుతో ఆకారంతో సంబంధం లేదు అని రిప్లై ఇచ్చారు. దానికి రోషిని మరి ఆ ఫిల్టర్ ఎందుకు ఉంది అన్న దానికి వివరణ ఇవ్వమని అడిగింది. అప్పుడు షాదీ డాట్ కాం వాళ్ళు ఇకపై నుండి ప్రొఫైల్లో ఫోటోలు ఫిల్టర్ చేసే ఆప్షన్ తీసేసాం అని ట్వీట్ చేశారు.తర్వాత ఇదంతా చూసిన జీవన్ సాథీ డాట్ కాం కూడా తమ వెబ్సైట్లో ఉన్న కలర్ ఫిల్టర్ ని తీసేసిన విషయం ట్విట్టర్లో ప్రకటించింది.
ఈ నిరసనని బహిరంగంగా వ్యక్తం చేసిన ముగ్గురు మహిళలకు వ్యక్తిగతంగా పరిచయం లేదు. కానీ ఇలాంటి వెబ్ సైట్ వాళ్ళు చేస్తున్నవి ఎంత తప్పో చెప్పడానికి ముగ్గురు ఒకరికొకరు మద్దతుగా నిలబడ్డారు. ఆ పిటిషన్ మీద 1500 మంది సైన్ చేసి ఆ ముగ్గురు మాట్లాడేది నిజం అని నిరూపించారు.
కానీ ఎంతమంది మద్దతిచ్చినా కూడా మేఘన్,హేతల్, రోషిని మాత్రం ఎంతో ధైర్యంగా ఎన్నో ఏళ్ల నుండి ఆచారం పేరుతో జనాలు సొంతంగా నిర్మించుకున్న ఒక లక్షణం (క్రైటీరియా) ని కొంతవరకు తీసేయడం లో విజయం సాధించారు. ముందు ముందు భారతదేశం రంగు అనేది అదేదో సమస్యలా కాకుండా సాధారణమైన విషయం లాగా పరిగణించే స్థాయికి ఎదగాలని ఆశిద్దాం. అసలు రంగు అనేది ఏ రంగంలోనూ ముఖ్యమైనది కాకూడదు అని కోరుకుందాం.
End of Article