Ads
చైనా వస్తువుల మీద చైనా యప్స్ మీద భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇండియా లో ప్రజాదరణ పొందిన టిక్ టాక్ సహా మరో 59 యాప్ లను నిషేధించింది. భారతదేశ దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను అడ్డుకుంటున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
Video Advertisement
తాజాగా భారత్ చైనా సరిహద్దు ప్రాంతం లడక్ లో చైనా ఆర్మీ ఇటీవల భారత్ ఆర్మీ కి చెందిన సైనికులను దారుణంగా చంపడంతో సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తులపై,చైనా యప్స్ పై నిషేధం విధించాలని సోషల్ మీడియా లో పెద్దఎత్తున డిమాండ్ పెరగడం జరిగింది.భారతదేశ దేశ రక్షణకు హానికరంగా ఉందన్న కారణంతో 59 చైనా యాప్ లను నిషేదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు .
మన దేశంలో మిగతా చైనా యాప్స్ కంటే టిక్ టాక్ యూజ్ చేస్తున్న వాళ్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది..యాక్టింగ్ అవకాశాలు లేవని,రావట్లేదని బాధపడకుండా టిక్ టాక్ లో వీడియోలు చేసుకుంటూ లక్షల్లో ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఫేమస్ అయిన వాళ్లున్నారు..వాళ్లల్లో మన తెలుగు వాళ్లు కూడా అనేకమంది ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో వారు చివరగా ఏం వీడియో పెట్టారో చూడండి.
End of Article