Ads
ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ లోని సినా అతర్ అనే మెడికల్ క్లినిక్ లో గ్యాస్ లీక్ అయ్యి ఘోర ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో 19 మంది మరణించారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై ఆసుపత్రి అధికారి మాట్లాడుతూ “పేలుడు జరిగిన సమయంలో మెడికల్ క్లినిక్ లో దాదాపు 25 మంది ఉద్యోగులు ఉన్నారు. కొంతమంది పేషెంట్లు కూడా ఉన్నారు. ఆ సమయంలో మైనర్ చికిత్సలు జరుగుతున్నాయి” అని చెప్పారు.
Video Advertisement
ఇటీవల ఇరాన్ రాజధానిలో ఉన్న మిలటరీ కాంప్లెక్స్ దగ్గర భారీ పేలుడు జరిగింది. ఇది జరిగిన నాలుగు రోజులకి మెడికల్ క్లినిక్ లో గ్యాస్ లీక్ జరిగింది. గ్యాస్ లీక్ విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. దాదాపు రెండు గంటల తర్వాత మంటలను అదుపు చేయగలిగారు. కానీ అప్పటికే చుట్టుపక్కల మొత్తం దట్టంగా పొగ కమ్ముకుంది. స్థానికులు భయపడి తమ ఇళ్లల్లో నుండి బయటికి పరుగులు పెట్టారు.
ఆ మెడికల్ క్లినిక్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పొగ విస్తరించడం వల్ల ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. పొగ కమ్ముకోవడమే కాకుండా మంటల వల్ల ఆ ప్రాంతం మొత్తం వేడిగా మారింది. దీంతో స్థానికులు ఇంకా ఇబ్బంది పడ్డారు.బిల్డింగ్ లో చిక్కుకున్న వాళ్ళు తమని కాపాడమంటూ గట్టి గట్టిగా అరిచారు.ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్లినిక్ లో ని బేస్మెంట్లో గ్యాస్ లీక్ అయింది. దాంతో ఇంత పెద్ద ప్రమాదం సంభవించింది. గ్యాస్ వాసన వల్ల చాలామందికి ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైంది. పొగ, వేడి, ఇంకా ఊపిరి కూడా ఆడకపోవడంతో చాలా మంది డాక్టర్లు, ఆస్పత్రి స్టాఫ్, పేషంట్లు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొంతమందికి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వారిని వెంటనే వేరే ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారి మాత్రమే పేలుడు సంభవించింది అని ఆసుపత్రి మేనేజ్మెంట్ చెప్తున్నారు కానీ స్థానికులు మాత్రం ఒకటి కాదు రెండు సార్లు పేలుడు జరిగింది. మొదటి పేలుడు అయిన పదినిమిషాల తర్వాత రెండో పేలుడు జరిగింది అని అంటున్నారు.
End of Article