“టిక్ టాక్” బ్యాన్ అయిన తర్వాత…భారత ఉద్యోగులకు టిక్ టాక్ సి‌ఈ‌ఓ రాసిన లెటర్ ఇది.!!

“టిక్ టాక్” బ్యాన్ అయిన తర్వాత…భారత ఉద్యోగులకు టిక్ టాక్ సి‌ఈ‌ఓ రాసిన లెటర్ ఇది.!!

by Megha Varna

Ads

చైనా వస్తువుల మీద చైనా యప్స్ మీద  భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఇండియా లో ప్రజాదరణ పొందిన టిక్ టాక్ సహా మరో 59 యాప్ లను నిషేధించింది. భారతదేశ దేశ రక్షణకు, ప్రజా సంక్షేమానికి హానికరంగా భావిస్తున్న కార్యకలాపాలతో సంబంధం ఉందన్న కారణంతో ఈ యాప్ లను అడ్డుకుంటున్నామని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Video Advertisement

భారీ ప్రజాదరణ పొందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌తో సహా చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధించిన 48 గంటల లోపే, కంపెనీ గ్లోబల్ హెడ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. “మా ఉద్యోగులు మా అతిపెద్ద బలం, వారి శ్రేయస్సు మా ప్రధానం. వారికి సానుకూల అవకాశాలను పునరుద్ధరించడానికి మేము  ప్రయత్నిస్తాము. 2,000 మంది ఉద్యోగులకి ఇదేమా హామీ.

మా వేదిక భారతదేశంలో దురదృష్టకర సవాలును ఎదుర్కొంది. ఏదేమైనా, మేము మా మిషన్ ను పరిష్కరించాము మరియు కట్టుబడి ఉంటాము. సమస్యలను పరిష్కరించడానికి వాటాదారులతో కలిసి పని చేస్తున్నాము. టిక్ టాక్ భారతీయ చట్టం ప్రకారం అన్ని డేటా గోప్యత మరియు భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతుంది. వినియోగదారు గోప్యత మరియు సమగ్రతకు అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తుంది. మా వేదికపై మీ ప్రేమ మరియు మద్దతుతో మేము హృదయపూర్వకంగా ప్రోత్సహించబడ్డాము. మీరు మాపై చూపిన నమ్మకానికి విశ్వాసానికి ధన్యవాదలు.” అని ఆయన పేర్కొన్నారు.

వారి అవ‌కాశాల‌ను పున‌రుద్ద‌రించ‌డానికి శ‌క్తిమేర కృష్టి చేస్తాం…అనే దాన్ని బ‌ట్టి టిక్ టాక్ మీద బ్యాన్ ను తీసేయ‌డానికి WTO ద్వారా ప్ర‌య‌త్నిస్తారా? లేక టిక్ టాక్ ను పోలిన మ‌రో కొత్త యాప్ తో వ‌స్తారా?  అనేది వేచి చూడాలి.!

తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం!

>>>CLICK HERE FOR DETAILS<<<


End of Article

You may also like