అతనొక బాడీ బిల్డర్…కానీ కరోనా సోఖి ఎలా పీనుగులా మారిపోయాడో చూడండి!

అతనొక బాడీ బిల్డర్…కానీ కరోనా సోఖి ఎలా పీనుగులా మారిపోయాడో చూడండి!

by Mohana Priya

Ads

ఒక మనిషి ముందు ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక్కసారి కరోనా వచ్చి తగ్గిన తర్వాత రూపురేఖలు మారిపోతాయి. దీనికి ఉదాహరణ వాషింగ్టన్ కి చెందిన అహ్మద్ అయ్యద్. అహ్మద్ ఒక బాడీ బిల్డర్. అతనికి కరోనా సోకింది. ఇటీవల కరోనా నుండి కోలుకున్నాడు కానీ తన శరీరం మాత్రం ముందు ఉన్నంత బలంగా లేదు.

Video Advertisement

అహ్మద్ వయసు 40 ఏళ్ళు. అతను అమెరికా దేశస్థుడు అయినా వాషింగ్టన్ లో నివసిస్తాడు. అక్కడ రెస్టారెంట్ ని క్లబ్ ను నడుపుతున్నాడు. అంతేకాకుండా అహ్మద్ ఒక అథ్లెట్ కూడా. రేస్ లలో, మారథాన్ లలో పాల్గొనేవాడు. ఇవే కాకుండా బాస్కెట్బాల్, బాక్సింగ్ కోచింగ్ కూడా ఇచ్చేవాడు. అహ్మద్ ఒక రోజు ఆరోగ్యం బాగా లేక ఆసుపత్రికి వెళితే కరోనా ఉంది అని తెలిసింది.

కరోనా కారణంగా అహ్మద్ 25 రోజులు కోమాలో ఉన్నాడు. నడవడం, శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆరోగ్య పరిస్థితి విషమం అవ్వడంతో తో వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందేవాడు. ఆరు వారాలు పోరాడిన తర్వాత అహ్మద్ కోలుకున్నాడు. ఏప్రిల్ 22న హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ముందు ఎంతో బలంగా ఉండే అహ్మద్ తర్వాత బలహీనంగా అయిపోయాడు. కండలు పోయి చాలా బరువు తగ్గి పోయాడు. అథ్లెట్ చాయలు ఎక్కడా కనిపించలేదు.

శరీర సౌష్టవం పోయినా కూడా మళ్ళీ కొన్ని రోజులు కష్టపడితే మామూలు స్థితికి రావచ్చు. కానీ ప్రాణం పోతే తిరిగి రావడం అసాధ్యం. దాంతో అహ్మద్ బరువు పూర్తిగా తగ్గిపోయినా కానీ తను మళ్లీ తిరిగి  కోలుకున్నందుకు ఊపిరి పీల్చుకున్నాడు. తన స్నేహితులు బంధువులు కూడా తను మళ్లీ మామూలు స్థితికి రాగలడు అని ప్రోత్సహిస్తున్నారు.


End of Article

You may also like