బిగ్ బాస్ ఫేమ్ “రవికృష్ణ” కు కరోనా…నవ్యకు పాజిటివ్ అని తెలిసిన రెండు రోజులకే..!

బిగ్ బాస్ ఫేమ్ “రవికృష్ణ” కు కరోనా…నవ్యకు పాజిటివ్ అని తెలిసిన రెండు రోజులకే..!

by Megha Varna

Ads

సీరియల్ నటి నవ్య స్వామికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత ఇప్పుడు మరొక సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. నవ్య స్వామితో పాటు షూట్‌లో పాల్గొన్న నటుడు రవికృష్ణ కూడా కరోనా పాజిటివ్ అని తెలిసిందే. “ఆమె కథ” సీరియల్ షూటింగ్ లో ఈ ఇద్దరు పాల్గొన్నారు. నవ్యకు కరోనా పాజిటివ్ అని తెలిసిన తర్వాత…ఆ సీరియల్ క్యాస్ట్ అందరిని హోమ్ క్వారెంటైన్ కి తరలించారు. తాజాగా రవిక్రిష్ణకు కూడా పాజిటివ్ అని తేలింది. సీరియల్స్ కంటే బిగ్ బాస్ 3 ద్వారా మరింత ఫేమస్ అయ్యారు రవి కృష్ణ.

Video Advertisement

షూటింగ్స్ తిరిగి ప్రారంభమైన తరువాత కరోనావైరస్ సోకిన నాల్గవ సీరియల్ నటుడు రవి కృష్ణ. “నవ్య స్వామిని లేదా ఎవరినీ నిందించడం ఇష్టం లేదు “అని రవికృషిహ్న అన్నారు. కరోనావైరస్ సోకిన రోగులపై వివక్ష చూపవద్దని ఆయన ప్రజలను కోరారు.  రవి కృష్ణ తెలుగు సీరియల్ మొగిలిరేకులుతో వెలుగులోకి వచ్చాడు మరియు వరుధిని పరిణయం, బావా మరదల్లు, దటీజ్ మహాలక్ష్మి సీరియల్స్ తో గుర్తింపుపొందారు. ప్రస్తుతం ఆమె కథ సీరియల్ లో నటిస్తున్నారు.

“అందరికి నమస్కారం… నాకు కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. నేను 3 రోజుల నుండి ఐసొలేషన్ లో ఉన్నాను. మీ ఆశీర్వాదాలతో మరియుదేవుని దయతో నేను బాగానే ఉన్నాను . కరోనా లక్షణాలు లేవు. కరోనా నాకు ఎలా సోకింది అని నేను చింతించాల్సిన అవసరం లేదు. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే… ఇటీవల ఎవరైతే నన్ను కలిసారో వారు కరోనా పరీక్ష చేయించుకోండి. ఐసొలేషన్ లో ఉండండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను” అంటూ రవికృష్ణ తాజాగా ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు.

తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం!

>>>CLICK HERE FOR DETAILS<<<


End of Article

You may also like