కరోనా టైం లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.? ఈ 5 జాగ్రత్తలు తప్పక తీసుకోండి.!

కరోనా టైం లో ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా.? ఈ 5 జాగ్రత్తలు తప్పక తీసుకోండి.!

by Mohana Priya

Ads

కరోనా వల్ల బయటికి వెళ్లలేని పరిస్థితుల కారణంగా ఏది కావాలన్నా ఆన్లైన్లోనే తెప్పించుకుంటున్నారు జనాలు. కానీ ఇలా ఆన్లైన్లో తెప్పించుకునే వస్తువులను ముట్టుకోవాలంటే కూడా జాగ్రత్త అవసరం అని డాక్టర్లు అంటున్నారు. ఆన్లైన్ లో వస్తువులు ఆర్డర్ చేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

Video Advertisement

#1 ఆర్డర్ చేసిన వస్తువులు వచ్చిన వెంటనే ఓపెన్ చేయకండి. ఒక వస్తువు వచ్చేముందు ఎన్ని చోట్ల నుండి మారి వస్తుందో తెలీదు. కాబట్టి ఆర్డర్ వచ్చిన తర్వాత రెండు రోజులు ఆగి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే ముందు కవర్ మీద శానిటైజర్ స్ప్రే చేయండి. ఒకవేళ ఈ వస్తువు కరెక్ట్ గా ఉంటే కవర్ ని పారేయడం మంచిది. లేదు అంటే కవర్ ని జాగ్రత్తగా ఉంచండి.

#2 వీలున్నంతవరకూ పేమెంట్ ఆన్లైన్లోనే చేయండి. ఎందుకంటే ఒక నోటు ఎంత మంది చేతులు మారుతుందో, ఎంత మంది తాకారో తెలియదు. కాబట్టి ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఉంటే అదే ఎంచుకోవడం మంచిది.

#3 డెలివరీ అతని నుండి వస్తువులు డైరెక్ట్ గా చేతిలోకి తీసుకోకండి. ఒక కవర్ లేదంటే ఒక బుట్ట ఏర్పాటు చేసుకోండి. అందులో మీ వస్తువుని వేయించుకోండి. వస్తువు కవర్ తెరిచిన తర్వాత దాన్ని మీ మీద పెట్టుకోవడం లాంటివి  చేయడం తగ్గించండి. ఒకవేళ అలా చేసినా కూడా వెంటనే వెళ్లి బట్టలు మార్చుకోవడం లేదా స్నానం చేయడం చేయండి.

#4 ఒకవేళ మీరు జాగ్రత్తగా ముట్టుకున్నా కూడా చేతులు సబ్బు లేదా హ్యాండ్ వాష్ ఉపయోగించి శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవేళ ఆ వస్తువు ఎలక్ట్రానిక్ కాకపోతే కొంచెం శానిటైజర్ చల్లి శుభ్రంగా తుడవండి.

#5 మామూలు వస్తువులే కాకుండా కూరగాయలు కూడా ఈ మధ్య ఆన్లైన్లోనే తెప్పిస్తున్నారు. కూరగాయల మీద శానిటైజర్ వాడటం ప్రమాదకరం. కాబట్టి అలా ఆన్లైన్లో తెప్పించిన కూరగాయలను గోరువెచ్చని నీటిలో పసుపు లేదా ఉప్పు వేసి నానబెట్టండి. తర్వాత శుభ్రంగా కడిగేసేయండి. పసుపు, ఉప్పులో క్రిములను చంపే గుణం ఉంటుంది. దాంతో అవి నీళ్లలో వేయడం వల్ల కూరగాయల మీద ఉన్న బ్యాక్టీరియా పోతుంది.

ఇవి ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు పాటించవలసిన జాగ్రత్తలు. ఇవే కాకుండా మామూలుగా కూడా చేతులు రోజులో వీలైనన్నిసార్లు కడుక్కోండి, ఇల్లు కూడా డిసిన్ఫెక్టన్ట్ క్లీనర్ తో తుడవండి. మధ్య మధ్యలో మీరు వాడే మాస్క్ లను కూడా శానిటైజర్ చల్లిన బట్టతో తుడుచుకోండి. ఒకవేళ మీ మాస్క్ బట్టతో తయారు చేసినది అయితే ఒకసారి ఉతకండి. మీరు సురక్షితంగా ఉండండి మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నించండి.

తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం!

>>>CLICK HERE FOR DETAILS<<<


End of Article

You may also like