Ads
కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని విషయం తెలిసిందే. కరోనా అనుమానితులు రోజరోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ ల్యాబ్ లకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అనుమతిని ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.అయితే కరోనా పరీక్షకు కేవలం 2200 మాత్రమే తీసుకోవాలని ప్రైవేట్ ల్యాబ్ లకు సూచించింది తెలంగాణ ప్రభుత్వం.
Video Advertisement
ప్రస్తుతం తెలంగాణాలో 22 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 1850కు పైగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో అధికశాతం కరోనా పాజిటివ్ కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉండటం ఆందోళనగా కలిగిస్తుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా ఇప్పటివరకూ 288 మంది మృతి చెందారు. కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.
హైదరాబాద్ లో ఏ ఏరియాలో ఎక్కువ కేసులు ఉన్నాయంటే?
బహదూర్‌పురా నియోజకవర్గం ఫలక్‌నుమా సర్కిల్లోని కిషన్‌బాగ్, అసద్‌బాబానగర్, యాకుత్‌పురా నియోజకవర్గంలో చంచల్‌గూడ, అమాన్‌నగర్ -ఎ, బి, రెయిన్‌బజార్, తలాబ్‌కట్ట, గౌలిపుర, చార్మినార్ నియోజకవర్గం లో ఖాజీపురా, చౌక్, ఝాన్సీబజార్, మొఘల్‌పురా, మలక్‌పేట్ నియోజకవర్గంలో అక్బర్‌బాగ్, ఓల్డ్ మలక్‌పేట్, సైదాబాద్, మాదన్నపేట్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఫూల్‌బాగ్, బాబానగర్, రియాసత్‌నగర్, గుల్షన్ ఎక్బాల్ కాలనీ, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో అత్తాపూర్, హైదర్‌గూడ, జలాల్‌బాబానగర్, హసన్‌నగర్, శాస్త్రీపురం, మైలార్దేవుపల్లి ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
జోన్ల వారీగా కరోనా కేసులు ఇలా:
మలక్‌పేట్ సర్కిల్ – 640
సంతోష్ నగర్ సర్కిల్ – 574
చాంద్రాయణగుట్టసర్కిల్ – 370,
చార్మినార్ సర్కిల్ – 463
ఫలక్‌నుమా సర్కిల్ – 344,
రాజేంద్రనగర్ సర్కిల్ - 202
ప్రస్తుతం నెలకొన్న కరోనా కష్టకాలంలో ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్ళండి. సోషల్ డిస్టెంసింగ్ పాటించండి. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించండి. ఏదైనా కాంటాక్ట్ చేస్తే శానిటైజర్ తో చేతులను కడుక్కోండి.
తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగు అడ్డా ఆహ్వానం!
>>>CLICK HERE FOR DETAILS<<<
End of Article