Ads
జులై 7. భారత క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు. ధోని పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా మొత్తం ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన తోటి క్రికెటర్లు, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగానికి చెందిన వారు, అన్నిటికంటే ముఖ్యంగా ధోని అభిమానులు అందరూ సోషల్ మీడియా వేదికగా ధోని కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు.
Video Advertisement
ధోని భార్య సాక్షి కూడా ఇంస్టాగ్రామ్ లో ధోని తన పెంపుడు జంతువులతో ఆడుకుంటున్న ఫోటోల తో పాటు, ధోనీ తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటో, అలాగే మరికొన్ని ఫోటోలను షేర్ చేస్తూ, క్యాప్షన్ లో ఒక మెసేజ్ తో ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
“ఇవాళ నువ్వు పుట్టినరోజు. నీ వయసు ఇంకొక సంవత్సరం పెరిగింది. నువ్వు కూడా ఇంకా తెలివిగల వాడివి అయ్యావు. నీకు బహుమతులు, ప్రశంసలు ఏవి పెద్దగా నచ్చవు. నువ్వు వాటిని అంత సీరియస్ గా తీసుకోవు. ఈ ఏడాది నీ పుట్టినరోజు ని కేక్ కట్ చేసి, క్యాండిల్స్ ఊది జరుపుకుందాం. హ్యాపీ బర్త్డే హస్బెండ్” అని సాక్షి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.
“పదేళ్లుగా మనిద్దరం కలిసి ఉంటున్నాం. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటున్నాం. పదేళ్లలో ఇద్దరం ఎంతో పరిణితి చెందాం. చిన్న చిన్న గొడవలు వచ్చాయి. కానీ మళ్లీ సర్దుకున్నాం. వాటివల్ల ఇంకా క్లోజ్ అయ్యాం. జీవితంలో ముఖ్యమైన విషయాలకు నిజంగా అంత ప్రాముఖ్యత ఎందుకు ఇస్తారో మనం అర్థం చేసుకున్నాం.
ఎప్పుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు మనకు ఇష్టం లేని పని చేయకుండా, ప్రతి విషయంలో దాపరికాలు లేకుండా ఉన్నాం. దాంతో మన బంధం ఇంకా బలపడింది. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా ఒకరికి ఒకరం తోడుగా ఉన్నాం, ఇవన్నీ ప్రేమంటే ఏంటో అర్థం అయ్యేలా చేశాయి.తల్లిదండ్రులకి, బంధువులకి, తోబుట్టువులకి, స్నేహితులకి, ధన్యవాదాలు చెబుతూ ఈ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాం” అని సాక్షి మరొక పోస్ట్ ద్వారా తెలిపారు.
సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్, రవి శాస్త్రి, హార్దిక్ పాండ్యా, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి క్రికెటర్ల తో పాటు, సాయి ధరమ్ తేజ్, సందీప్ కిషన్, ప్రణీత, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్ వంటి టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ధోని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
End of Article