సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్…సీసీటీవీ ఫుటేజ్..? షాకింగ్ విషయం వెలుగులోకి.!

సుశాంత్ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్…సీసీటీవీ ఫుటేజ్..? షాకింగ్ విషయం వెలుగులోకి.!

by Megha Varna

Ads

దేశాన్ని విస్తుపోయేలా చేసిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు.సుశాంత్ సూసైడ్ చేసుకోవడానికి కారణమంటూ పేర్లు వినిపించిన సినీ సెలబ్రెటీలను వరుసగా విచారిస్తున్నారు.ఇప్పటికే సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ అయిన రియా చక్రబోర్తని విచారించిన పోలీసులు తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ని మూడు గంటల పాటు విచారించారు.

Video Advertisement

ఈ విచారణలో సంజయ్ లీలా భన్సాలీ సుశాంత్ సింగ్ కు రామ్‌లీలా, బాజీరావు మస్తానీ, పద్మావతి చిత్రాల్లో ఆఫర్లు ఇచ్చిన మాట నిజమేనని కాని అప్పటికే సుశాంత్ వేరే సంస్థతో అగ్రిమెంట్ చేసుకొని ఉండడంతో డేట్స్ అడ్జెస్ట్ అవ్వక ఈ సినిమాలలో నటించలేదని అన్నారు. ఈ స్టేట్మెంట్ ను బాంద్రా పోలీసులు రికార్డు చేసుకొన్నారు.

సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకున్న ఫ్లాట్స్ కు వెళ్ళిన పోలీసులు జూన్ 14వ తేదీకి ముందుగానీ ఆతర్వాత గానీ సుశాంత్ ఫ్లాట్ లోకు ఎవరైనా ప్రవేశించి సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఆ బిల్డింగ్ కు సంబందించి సుశాంత్ సింగ్ సిసిటివీ ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు.

ఆ బిల్డింగ్ లో అన్ని ఫ్లాట్స్ ముందు సీసీటీవీ కెమెరా ఉంది.కాని సుశాంత్ ఫ్లాట్ ముందు సీసీటీవీ కెమెరా లేదు.అది గమనించిన పోలీసులు సుశాంత్ ఫ్లాట్ ముందు సీసీటీవీ ని ఎందుకు అమర్చలేదని సిబ్బిందిని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటివరకు పోలీసులు సుశాంత్ సూసైడ్ పై ఆయన సన్నిహితులు మరియు సినీ పరిశ్రమ లింక్స్ ఉన్నవారిని కలుపుకొని దాదాపు 34 మంది వద్ద స్టేట్మెంట్స్ ను తీసుకున్నారు.


End of Article

You may also like