Ads
మన తెలుగు చిత్రాలకు నార్త్ లో మంచి డిమాండ్ ఉంది అందుకే మన తెలుగు చిత్రాలను హిందీ డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో సదరు నిర్మాణ సంస్థలు విడుదల చేస్తుంటాయి.వాటికి కొన్ని గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ వస్తుంటాయి.ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయినప్పుడు చిత్రాలకు రాని కలెక్షన్స్ అవే సినిమాలు యూట్యూబ్ లో విడుదలైతే మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి.ఇలా ఎందుకు జరుగుతుంది అనే ప్రశ్నకు ఫిల్మ్ క్రిటిక్స్ కూడా సమాధానం చెప్పలేకున్నారు.కనీసం ఇప్పటికైనా మన తెలుగు పరిశ్రమ వారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే మన సినిమాలకు మరింత కలెక్షన్స్ వస్తాయి.
Video Advertisement
ఇక చేసిన లేట్ చాలు టాపిక్ లోకి వెళ్ళిపోద్దాం.అక్కినేని మూడవ తరం యువ హీరో నాగ చైతన్య,నిధి అగర్వాల్ తో జంటగా నటించిన చిత్రం ‘సవ్యసాచి’.ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించారు.అంతకముందు నాగ చైతన్య,చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘ప్రేమమ్’ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైంది. కాని చిత్రం విడుదలయ్యాక ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేక అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
మరి ఇప్పుడు ఈ చిత్రం గురించి ఎందుకు భయ్యా అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న ఈ చిత్రం డబ్బింగ్ చేసి ఆదిత్య వాళ్ళు యుట్యూబ్ లో విడుదల చేశారు.తాజాగా ఈ చిత్రం 100 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించింది.
End of Article