Ads
టెక్నాలజీ పుణ్యమో సోషల్ మీడియా పుణ్యమో తెలియదు కాని దొంగల క్రియేటివిటీ రోజుకొకటీ బయటపడుతుంది.తాజాగా తమిళనాడులోని కడలూరు జిల్లా పన్‌రూటి లోని ముగ్గురు దొంగలు ఏకంగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు.ఎస్‌బీఐ జోనల్ మేనేజర్ ఫిర్యాదు మేర పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని నకిలీ బ్రాంచ్ కు సీల్ వేశారు.
Video Advertisement
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ అంబేద్కర్ మీడియాతో మాట్లాడుతూ ఈ క్రైమ్ లో ప్రధాన సూత్రధారైన కమల్‌బాబు తల్లి ఒక ప్రముఖ బ్యాంక్ లో పని చేస్తూ రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ తీసుకున్నారు.తల్లికి అనుమానం రాకుండా కావల్సిన సమాచారమంతా సేకరించాక ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న ఒక వ్యక్తితో రబ్బర్ స్టాంప్‌లను తయారు చేసే మరో వ్యక్తితో కలిసి ఈ బ్రాంచ్ ను ఏర్పాటు చేశాడు.
బ్రాంచ్ వాతావరణం చూసి అనుమానం వచ్చిన కస్టమర్ ఫిర్యాదు మేర స్పందించిన వేరే బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ జోనల అధికారులకు సమాచారాన్ని అందించాడు.అది నకిలీ బ్రాంచ్ అని తెలియడంతో బ్యాంక్ అధికారులు ఆ బ్రాంచ్ లో తనిఖీలు జరిపారు.దాదాపు మూడు నెలల నుండి కొనసాగుతున్న ఆ నకిలీ బ్రాంచిలో లావాదేవీలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకొని దగ్గరే ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తమ అదుపులో ఉన్న నిందితులను త్వరలోనే కోర్టు లో ప్రవేశపెడుతామని అంబేద్కర్ అన్నారు.
End of Article