Ads
నెల్లూరు లో డిగ్రీ చదువుతున్న యువతి లైవ్ సూసైడ్ చేసుకున్న సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Video Advertisement
నెల్లూరులో డిగ్రీ చదువుతున్న రమ్యను ముగ్గురు యువకులు వేధిస్తున్నారని యువతి తల్లిదండ్రులు కంప్లైంట్ లో పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆ కోణంలో కేసును దర్యాప్తు చేస్తున్నారు.రమ్య ఫోన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు తను ఆత్మహత్య చేసుకునే ముందు శివ అనే వ్యక్తితో చాట్ చేస్తుందనే విషయాన్ని గుర్తించారు.శివ రమ్య మెసేజ్ లకు రిప్లై ఇవ్వకపోవడంతో తన మెసేజ్ లకు రిప్లై ఇవ్వపోతే సూసైడ్ చేసుకుంటానని అని రమ్య మెసేజ్ చేసింది. ఎంతసేపటికీ శివ స్పందించకపోవడంతో రమ్య లైవ్ లో సూసైడ్ చేసుకుంది.
శివతో చాట్ చేస్తున్న టైం లోనే రమ్య భార్గవ్ అనే వ్యక్తితో కూడా చాట్ చేస్తుందని పోలీసులు ధృవీకరించారు.మూడవ వ్యక్తి గురించి ఎటువంటి సమాచారం ఇంకా లభించలేదు.
ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తామని పోలీసులు రమ్య తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
End of Article