డెలివరీ అడ్రస్ రాయమంటే ఇలా కూడా రాస్తారా? హైదరాబాద్ లో అంతే అనుకుంటా?

డెలివరీ అడ్రస్ రాయమంటే ఇలా కూడా రాస్తారా? హైదరాబాద్ లో అంతే అనుకుంటా?

by Megha Varna

Ads

ఆన్ లైన్ షాపింగ్ లో అన్ని వస్తువులు ఒకే దగ్గర  ఉండడం పైగా అవి మన ఇంటికి తెచ్చిస్తుండటంతో శ్రమ లేకుండా పని అయిపోతుందని ప్రజలందరూ ఆన్ లైన్ షాపింగ్ లు పై తెగ ఖర్చు చేస్తున్నారు.అధిక జనాభా ఉన్న దేశం కావడం పైగా ఆన్ లైన్ షాపింగ్ భారీగా జరుగుతుండడంతో మన దేశంలో బోలెడు ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్స్ వెలిశాయి. కస్టమర్స్ ఫ్రెండ్లీగా ఉండాలని ప్లాట్ ఫారమ్స్ అన్నీ తెగ కష్టపడుతున్నాయి.ఇలాంటి టైంలో  ఫ్లిప్ కార్ట్ తమకు ఎదురైన ఒక క్రేజీ కస్టమర్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.

Video Advertisement

 

ఇంతకీ ఆ క్రేజీ కస్టమర్ ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌ లో ఓ వస్తువును ఆర్డర్‌ చేశారు. ఆ వస్తువు అడ్రస్ కాలమ్ లో  ‘448 చావోత్‌ మాతా మందిరం దగ్గరికి రండి.అక్కడికి వచ్చి నాకు ఫోన్ చేయండి. నేను అక్కడికి వస్తా’ అని రాశాడు. దీన్ని ట్విటర్‌ యూజర్‌ ఒకరు సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశాడు.అది ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ చూసిన నెటిజన్లు ‘మరి ఇండియా అంటే అదో లెవల్‌..’ అంటూ కొందరు. ‘ఇండియాలో ఇ-కామర్స్ విభిన్నం’, ’ఇది భలే సరదాగా ఉంది..’ అని మరికొందరు కామెంట్ చేశారు.

ఈ ట్వీట్ పై ఫ్లిప్‌కార్ట్ సంస్థ కూడా డెలివరీ డబ్బాపై ఉన్న అడ్రస్‌ను హైలైట్ చేస్తూ.. ‘మాకు ప్రతి ఇల్లూ ఓ ఆలయమే.. ఇది మమ్మల్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్లింది’ అంటూ రీట్వీట్ చేసింది.

https://twitter.com/Flipkart/status/1281176715272880129/photo/1

 


End of Article

You may also like