Ads
వివాదాలకు కేంద్ర బిందువైన ఆర్జీవీ కరోనా టైంలో కూడా ఫుల్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.తాజాగా ఆయన పవర్ స్టార్ అనే చిత్రాన్ని చేస్తున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లను స్వయంగా అర్జీవీ తన ట్విట్టర్ ఖాతా లో విడుదల చేశాడు.ఈ చిత్రాన్ని జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలలో ఆర్జీవీ బాగా బిజీగా ఉన్నాడు.
Video Advertisement

ఇలాంటి టైంలో ఫిల్మ్ సర్కిల్స్ లో త్వరలో ఆర్జీవీ మైక్ వదిలి మేకప్ వేసుకోబోతున్నాడు అనే వార్త చక్కెర్లు కొడుతుంది.అవునండీ మీరు విన్నది నిజమే ఆర్జీవీ తను చేస్తున్న పవర్ స్టార్ చిత్రంలో ఒక పాత్ర చేయబోతున్నారట.ఆ క్యారక్టర్ పవన్ వీరాభిమాని ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ను పోలి ఉంటుందట.

తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఎప్పుడు సంచలనాలు సృష్టించే ఆర్జీవీ తాజాగా తన నటనతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచి చూడాలి.
End of Article
