Ads
‘ఆ ఒక్కటి అడక్కు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రంభ ఆతర్వాత తమిళ,మలయాళ, హిందీ, భోజపురి,బెంగాలీ, ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఏప్రిల్ 11, 2010 సంవత్సరంలో ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకున్న రంభ ఆతర్వాత ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ కు దూరంగా ఉన్నది.
Video Advertisement
రంభ,ఇంద్ర కుమార్ లకు ఇద్దరు కూతుర్లు,ఒక కొడుకు ఉన్నాడు.వీరిద్దరూ డైవర్స్ తీసుకున్నట్టు చాలా కాలం నుండి రూమర్స్ వస్తున్నాయి.అప్పట్లో ఈ అంశం పై రంభ అలాంటిదేమీ లేదంటూ కొట్టి పారేశారు.నిజానికి రంభ,ఇంద్ర కుమార్ డైవర్స్ కు అప్లై చేశారు.కాని వీరికి కోర్టు డైవర్స్ మంజూరు చేయకుండా.ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇప్పించింది.దానితో సమస్యలు పరిష్కరించుకొని వీరు ఇప్పుడు కలిసి ఉంటున్నారు.
ప్రస్తుతం రంభ కర్ణాటకలోని తన సొంత ఇంటిలో భర్త, పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. ఈ మధ్య సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే పనిలో రంభ ఫుల్ బిజీగా ఉన్నారు.
End of Article