తన బోర్డు మార్కులు షేర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్…కెమిస్ట్రీ లో ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి!

తన బోర్డు మార్కులు షేర్ చేసిన ఐఏఎస్ ఆఫీసర్…కెమిస్ట్రీ లో ఎన్ని మార్కులు వచ్చాయో చూడండి!

by Mohana Priya

Ads

మామూలుగా ఎవరినైనా తెలివిగలవాళ్ళు లేదా తెలివి లేని వాళ్ళు అని పరిగణించాలి అంటే ముందుగా ప్రాముఖ్యతను ఇచ్చేది వాళ్ళకు వచ్చిన మార్కులకే. ఒక మనిషికి ఎక్కువ మార్కులు వస్తే తెలివిగలవాడు అని లేదా తక్కువ మార్కులు వస్తే తెలివి లేని వాళ్ళు అని ముద్ర వేస్తారు.

Video Advertisement

ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఎన్నో సార్లు చెప్పారు ఒక మార్క్ షీట్ ఆ మనిషి యొక్క భవిష్యత్తును నిర్ణయించలేదు అని. కానీ అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టం ఇదే పద్ధతిని పాటిస్తోందా?

ఇటీవల CBSE ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను చూసి ఆందోళన చెందవద్దు అని ఐఏఎస్ నితిన్ సంగ్వాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా తనకి 12వ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయో చెబుతూ మార్క్ షీట్ కూడా పోస్ట్ చేశారు.

“నాకు 12వ తరగతిలో కెమిస్ట్రీలో 24 మార్కులు వచ్చాయి. పాస్ మార్కుల కంటే ఒక్క మార్కు ఎక్కువ. అంతే. కానీ ఆ మార్కులు నేను భవిష్యత్తులో ఏం చేయాలనేది నిర్ణయించలేకపోయాయి. మీ పిల్లలపై మార్కులు అనే భారాన్ని వేయకండి. ఈ పరీక్షలు, మార్కుల కంటే కూడా జీవితం ఎంతో పెద్దది. ఈ పరీక్ష ఫలితాలు మీ పిల్లలని పరిశీలించడం కోసం ఒక అవకాశం అనుకోండి అంతేకానీ విమర్శించకండి” అని ఆ పోస్ట్ కింద రాసిన క్యాప్షన్ లో పేర్కొన్నారు.

గత ఏడాది మార్కులు సరిగా రాలేదు అని ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు మరొక ఐఏఎస్ ఆఫీసర్ అశ్విన్ శరణ్ ఫేస్బుక్ లో ఈ ఘటన గురించి మాట్లాడుతూ ” ఇటీవల వెల్లడించిన పరీక్ష ఫలితాల్లో మార్కులు సరిగా రాలేదని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని చదివాను.

పరీక్షల ఫలితాలను అంత సీరియస్ గా తీసుకోవద్దు అని నేను విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అవి కేవలం అంకెలు మాత్రమే. భవిష్యత్తులో మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇంకా ఎన్నో అవకాశాలు వస్తాయి. నేను నా 10 వ తరగతి ఇంకా 12 వ తరగతి మార్క్ షీట్ ని షేర్ చేస్తున్నాను” అని అన్నారు.

వీళ్లే కాదు చరిత్రలో తమకంటూ పేరు సంపాదించుకున్న వాళ్లలో కూడా పరీక్షల్లో సరిగా మార్కులు తెచ్చుకొని వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఏదేమైనా ఒక మనిషి భవిష్యత్తును నిర్ణయించేది తన ఆలోచనలు, ప్రతిభ మాత్రమే మార్కులు కావు.


End of Article

You may also like