Ads
ప్రేమ ప్రపంచంలో అందరినీ పిచ్చోళ్ళను చేస్తుంది.అప్పుడప్పుడు ఆ పిచ్చి పీక్స్ కు వెళ్ళినప్పుడు జనాలు చాలా స్టంట్స్ వేస్తుంటారు.ఆ స్టంట్స్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికి అసలు అర్థం కాదు.తాజాగా మహారాష్ట్రకు చెందిన 20 ఏళ్ళ జిషాన్. ఇంటర్నేషనల్ బోర్డర్ గుజరాత్ కచ్ ప్రాంతం వద్ద బీఎస్ఎఫ్ అధికారులకు దొరికాడు.
Video Advertisement
అక్కడ తనేం చేస్తున్నాడని సైనికులు ప్రశ్నించగా తనకి fb ద్వారా పాకిస్థాన్ కరాచీకి చెందిన సమ్రనా ఫైసల్ అనే యువతితో పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారిందని అందుకే తనని చూడడానికి గూగుల్ మ్యాప్స్ సహాయంతో అతడు పాకిస్థాన్ వెళ్తున్నట్టు చెప్పాడు.
ఆతర్వాత అతని తండ్రి పెట్టిన మిస్సింగ్ కంప్లైంట్ ఆధారంగా జిషాన్ ను బీఎస్ఎఫ్
పోలీసుల కస్టడీకి అప్పగించింది..పోలీసులు అతని వద్ద ఉన్న పాన్,ఆధార్,ఏటీఎం కార్డ్ మరియు ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.అతడు చెప్పిన కథలో నిజమెంత అనే విషయం ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరి మనోడి ప్రేమ కథ పై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
End of Article