Ads
త్రిసూర్ కు చెందిన సజన్ కేచరి,ఫిరోజ్ అనే సోషల్ వర్కర్స్ కన్నూర్ కు చెందిన వర్ష కు సహాయం చేయమని కోరిన వాళ్ళ పై తాజాగా వర్ష పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.ఇప్పుడు ఈ ఉదంతం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.
Video Advertisement
రాధ తన కూతురుతో కలిసి కన్నూర్ లో నివసిస్తుంది.తన భర్త తనని వదిలి వెళ్లిపోవడంతో తన జీవనోపాధి కోసం ఐస్ క్రీం పార్లర్ లో పని చేస్తూ ఉండేది.తనకి ఉన్నట్టుండి జాండిస్ రావడంతో హాస్పిటల్ కు వెళ్ళింది.దానితో ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకోవాలని అన్నారు.దీనితో రాధ కూతురు వర్ష తమకు సహాయం చేయాలంటూ జూన్ 24 న ఫేస్ బుక్ లైవ్ లో కోరారు.
దీని పై స్పందించిన సజన్ కేచరి,ఫిరోజ్ ఆమెకు సహాయం చేయాలని వీడియోలు పోస్ట్ చేశారు.దాని పై స్పందించిన ప్రజలు 14 గంటల టైంలోనే దాదాపు 50 లక్షలు రాధ బ్యాంక్ ఖాతాలో జమ చేశారు.ఆ విషయం తెలుసుకున్న సజన్ చేసిన డొనేషన్స్ కు ధన్యవాదాలు ఆపరేషన్ కు కావాల్సిన డబ్బులు జమయ్యాయి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అలాగే బ్యాంక్ కు కూడా ఈ సమాచారం అందించడంతో బ్యాంక్ కూడా ఆ ఖాతాను క్లోజ్ చేసింది. అప్పటికి తన ఖాతాలో సుమారు 89 లక్షల సొమ్ము చేరింది.
ఆపరేషన్ మరియు ఇతర మెడికల్ ఖర్చులకు కలిపి 25 లక్షలను వినియోగించుకొని మిగిలిన డొనేషన్ డబ్బును అవసరంలో ఉన్నవారికి వినియోగించుకోవాలని సజన్ వర్షకు సజెస్ట్ చేశారు.ఆపరేషన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది.రాధ కూడా సేఫ్ గా ఉంది.
తాజాగా తన తల్లి ఆపరేషన్ కు సహాయం చేయడానికి ముందుకొచ్చిన సజన్ కేచరి,ఫిరోజ్,సలాం,షాహిద్ లు తనకి వచ్చిన డొనేషన్ అమౌంట్ లో షేర్ ఇవ్వమంటూ బెదిరిస్తున్నారని దానికి తను ఒప్పుకోకపోవడంతో తన పై సోషల్ మీడియాలో డి ఫేమ్ చేసే విధంగా పోస్టులు పెడుతున్నారని ఎర్నాకులం డీసీపీ కు కంప్లైంట్ చేసింది.దీని పై స్పందించిన ఫిరోజ్ తను మా బేబీ సిస్టర్ కాదంటూ కామెంట్ చేశారు.మరి ఈ ఉదంతంలో ఎవరూ చెప్పేది నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది
End of Article