“ఆ దయ్యం నన్ను రమ్మంటుంది” అంటూ లెటర్ రాసి ఆ విద్యార్థిని ఏం చేసిందంటే?

“ఆ దయ్యం నన్ను రమ్మంటుంది” అంటూ లెటర్ రాసి ఆ విద్యార్థిని ఏం చేసిందంటే?

by Megha Varna

Ads

లాక్ డౌన్ లో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మహత్యల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలో వేదాసందూర్ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

Video Advertisement

తాజాగా కాలేజీ విద్యార్థిని లతికా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటుంది.రెండు రోజుల క్రితం తన ఇంట్లో వారు ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకలలో ఆనందంగా ఉన్న లతికా సడన్ గా ఒక రోజు నుండి ఇంట్లో వారితో మాట్లాడటం మానేసింది.ఈ విషయం పై ఇంట్లో వారు ఎన్నిసార్లు అడిగిన లతికా మౌనంగా ఉంటున్నది.

మరేం ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.కూతురిని అలా చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం పంపించారు. లతిక గది నుండి ఒక లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అందులో “ఆ దెయ్యం నన్ను చనిపోయి తన వద్దకు రమ్మని పిలుస్తుంది .. అందుకే నేను వెళ్లిపోతున్నాను ..” అని ఉంది.


End of Article

You may also like