కన్న వారికి కరోనా సోకడంతో…ఆ 6 నెలల చిన్నారికి తల్లిగా మారిన డాక్టరమ్మ..!

కన్న వారికి కరోనా సోకడంతో…ఆ 6 నెలల చిన్నారికి తల్లిగా మారిన డాక్టరమ్మ..!

by Megha Varna

Ads

తల్లిని అప్పుడే పుట్టిన బిడ్డను కరోనా మహమ్మారి దూరం చేసింది. తల్లిదండ్రులిద్దరికి కరోనా సోకడంతో బంధువులు ముందుకు రాకపోవడంతో అప్పుడే పుట్టిన ఆ పసి కందు పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.దానితో తమ బాబును ఏం చేయాలో తెలియక దిగులు పట్టుకున్న ఆ తల్లిదండ్రుల ముందుకు అదే హాస్పిటల్ లో పనిచేస్తున్న అనిత అనే డాక్టర్ ముందుకు వచ్చింది.దాదాపు నెల రోజుల పాటు పసికందును తన ఇద్దరి పిల్లలతో కలిసి పెంచింది.

Video Advertisement

తాజాగా తల్లిదండ్రులిద్దరూ కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో డాక్టర్ అనిత తన రక్షణలో ఉంచుకున్న చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పారు.జన్మనిచ్చిన నాటి నుండి బిడ్డకు దూరంగా ఉంటున్న తల్లి ఆ చిన్నారిని చూసి కన్నీటి పర్యంతమైంది.బిడ్డను సొంత తల్లిదండ్రుల దగ్గరకు చేర్చిన డాక్టర్ అనిత గారు కూడా ఆ సమయంలో కన్నీటి పర్యంతమయ్యారు. బంధువులే ముందుకురాని సందర్భంలో తన బిడ్డ రక్షణను చూసుకున్న అనిత గారికి ఆ తల్లిదండ్రులిద్దరూ ధన్యవాదాలు తెలిపారు.

కొచ్చిన్ లో జరిగిన ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.డాక్టర్ అనిత గారి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


End of Article

You may also like