Ads
సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది.తాజాగా నేషనల్ మీడియాలో సుశాంత్ సింగ్ ఆత్మహత్య పై ఒక కొత్త కోణం ప్రొజెక్ట్ అవుతుంది.అదేంటంటే ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ అందించిన సమాచారం మేర సుశాంత్ ఓ నెలలో 50 సార్లు తన ఫోన్ సిమ్ లు మార్చాడు.మరి వాటిని పోలీసులు రికవర్ చేశారా? అంటూ ఆ షో లో పార్టిసిపేట్ చేసిన లాయర్ ఇష్కరన్ పోలీసులను ప్రశ్నించారు.
Video Advertisement
ఇప్పటివరకు సుశాంత్ సింగ్ ఇంటినీ పోలీసులు ఎందుకు సీజ్ చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు..సుశాంత్ ఇంటి ముందు సీసీటీవీ కెమెరాలు ఎందుకు లేవో ఇప్పటివరకు ఇంటిని ఎందుకు సీజ్ చేయలేదంటూ హీరోయిన్ కంగనా రౌనత్ కూడా పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే పోలీసులు సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు సంబంధించి హీరోయిన్లు రియా చక్రవర్తి, సంజనా సంఘీ, భన్సాలీ, ఆదిత్యా చోప్రా వంటి పలువురును ప్రశ్నించారు.ఇప్పటివరకు పోలీసులు ఈ కేసుకు సంబంధించి మొత్తం 38 మందిని విచారించారు.
పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగ్గా లేదని ఈ కేసును సిబిఐ కు అప్పజెప్పాలని సుశాంత్ తల్లిదండ్రులు, బంధువులు,బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రహ్మణ్యస్వామి మరియు సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
End of Article