Ads
ప్రపంచమే కాక భారతీయులు కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు అందుకే టీవీలో వస్తున్న రామాయణ, మహాభారతాలకు రికార్డ్ స్థాయిలో టీఆర్ పీలు వస్తున్నాయి. అందులో హాట్ స్టార్ లో వచ్చే మహాభారతం కూడా ఒకటి. ఈ సీరియల్ హిందీ, తెలుగు, తమిళం వంటి ప్రాంతీయ భాషల్లో హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది.
Video Advertisement
తాజాగా మహాభారతం సీరియల్ హాట్ స్టార్ లో కొన్ని భాషల్లో మాత్రమే కనిపిస్తుంది.దానికి హాట్ స్టార్ నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.దానితో తెలుగులో ఉన్న మహాభారతం సీరియల్ కనిపించకపోవడంతో ఈ సీరియల్ అభిమానులు అసలు ఏమైందో తెలుసుకోవాలని హాట్ స్టార్ కు తెగ మెసేజులు చేశారు.వారందరికీ ఓపిగ్గా హాట్ స్టార్ రిప్లై ఇచ్చింది. అందులో ప్రస్తుతం కొన్ని మ్యూజిక్ కాపీరైట్ ఇష్యూస్ వల్ల ఈ సీరియల్ ను కొన్ని భాషలను నిలిపినట్లు త్వరలోనే మళ్లీ ఈ షోను ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నట్లు చెప్పింది.
End of Article