Ads
ఎవరో చేసిన తప్పుకు మరెవరో బలయ్యారు అనే సామెత మీకు గుర్తుందా?ఉంది…గుర్తుంది..ఇంతకీ ఇప్పుడు దాని గురించి ఎందుకు అనుకుంటున్నారా?అదే అక్కడికే వస్తున్న తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.దానితో కొంతకాలంగా దాచిన ఓ సెలబ్రిటీ రిలేషన్ షిప్ బట్ట బయలయ్యింది.
Video Advertisement
అసలు కథేంటంటే కొద్ది నెలల క్రితం బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక భర్త, నిక్ జొనాస్ ముంబై సెలబ్రిటీలతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు.ఈ హోలీ వేడుకలలో నిక్ జొనాస్ తన కెమెరాకు పని చెప్పాడు.ఆ టైంలో కత్రినా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఉన్న ఫోటోలను అభిమానులు గుర్తించారు.వాటిని సోషల్ మీడియాలో తెగ షేర్ లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?ప్రముఖ నటుడు విక్కి కౌషల్. బాలీవుడ్ లో విక్కి కౌషల్,కత్రినా చాలా రోజుల నుండి డేటింగ్ చేస్తున్నారని చర్చ జరుగుతుంది. కాని దీని పై ఇద్దరు ఇప్పటివరకు స్పందించలేదు.ఇప్పటివరకు సీక్రెట్ గా ఉన్న తమ రిలేషన్ అందరికీ తెలిసిపోయింది.మరి ఇకనైనా వీరు ఈ విషయం పై స్పందిస్తారో లేదో చూడాలి.
End of Article