Ads
వివాదాలకు కేంద్రబిందువైన ఆర్జీవి తాజాగా పవర్ స్టార్ అనే చిత్రం చేస్తున్నారు.ఈ చిత్రం ట్రైలర్ కు మొదటిగా ఆర్జీవి 25 రూపాయలు చెల్లించాలని చెప్పాడు.దానితో కొంతమంది ఈ చిత్ర ట్రైలర్ చూడడం కోసం 25 రూపాయిలు చెల్లించారు. కానీ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన 4 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ యూట్యూబ్ లో లీక్ అయ్యింది.
Video Advertisement
దానితో ఆర్జీవి ఈ చిత్ర ట్రైలర్ ను అఫీషియల్ గా ఓ గంట లో యూట్యూబ్లో విడుదల చేస్తామని చెప్పాడు.దానితో పాటు ట్రైలర్ కోసం డబ్బులు చెల్లించిన వారందరికీ ఆ డబ్బులను రిటర్న్ చేస్తామని ఆయన తెలిపారు.ఈ చిత్రం చేస్తున్నందుకు ఆర్జీవి వరుసగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కాని అయిన వాటిని అసలు పట్టించుకోవట్లేదు.తాజాగా ఆర్జీవి ధోరణి మార్చుకోవాలని ఇండస్ట్రీ పెద్దలలో ఒకరైన అల్లు అరవింద్ ఆయనకు హితవు చెప్పారు.
పవర్ స్టార్ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఆర్జీవి అంటున్నారు దీన్ని తప్పకుండా అడ్డుకొని తీరుతామని మరోపక్క పవన్ ఫ్యాన్స్ అంటున్నారు.ఇందులో ఎవరి మాట నెగ్గేనో వేచి చూడాలి.
End of Article