ఏంటయ్యా వర్మా…ఈ సారి అంత మాట అనేసావు..! పాపం యాంకర్ రియాక్షన్..!

ఏంటయ్యా వర్మా…ఈ సారి అంత మాట అనేసావు..! పాపం యాంకర్ రియాక్షన్..!

by Megha Varna

Ads

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలలో చేసిన ఆయనను ఇంటర్వ్యూలు చేసిన ఇప్పుడు తెగ వైరల్ అయిపోతున్నారు.ఇలా ఎందుకు జరుగుతుందో ఒక్క రాంగోపాల్ వర్మ గారే చెప్పగలరు.మరి దీని పై ఆయన సమాధానం చెబుతారో లేదో వేచి చూడాలి.ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం.

Video Advertisement

తెలుగు అప్ కమింగ్ యాంకర్స్ లో ఒక్కరైనా ఆర్యానా ఈ నెల మొదట్లో ఆర్జీవిని ఇంటర్వ్యూ చేశారు.ఆ ఇంటర్వ్యూతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.దానితో మరోసారి ఈమెకు ఆర్జీవిని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది.ఈ ఇంటర్వ్యూలో ఆర్జీవి తన మాటల డోస్ పెంచేశాడు.ఏకంగా యాంకర్ తో ఇంతకుముందు మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది ఎందుకంటే అందులో మీ తొడలు కనపడ్డాయి.కాని ఇప్పుడు మీరు మొత్తం కవర్ చేసుకొని వచ్చి నా హృదయాన్ని గాయ పరిచారు ఐయాం డిసప్పాయింటెడ్ అని అన్నాడు.దానికి ఆర్యానా సార్ మళ్లీ ఇది కాంట్రవర్సీ అవుతుందని హెచ్చరించింది.

ram gopal varma latest interview anchor pics (3)

ram gopal varma latest interview anchor pics (3)

అందుకు ఆర్జీవి తనదైన శైలిలో చిన్న పిల్లలకు ఇష్టమైన ఫుడ్ ఇవ్వకుండా దాచడం అమ్మాయిలు అందాలు దాచుకోవడం రెండు పాపం అని కామెంట్ చేశాడు.ఇక విషయాన్ని లాగితే ఇబ్బంది అనుకున్న ఆర్యానా థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఇలాంటి కాంప్లిమెంట్ ఇప్పటివరకు నాకెప్పుడూ రాలేదు.మళ్లీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నానని ఎండ్ చేయబోయింది. కాని మన
ఆర్జీవి ఆ టాపిక్ అక్కడితో ఎండ్ చేయకుండా మీరు ఈసారి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వస్తే ఖచ్చితంగా నైనాందం కోసం ఇంతకు ముందు వేసుకున్న డ్రెస్ లాంటిది వేసుకొని వస్తే బాగుంటుంది అని అన్నాడు.దానికి ఆర్యానా స్యూర్ అంటూ ఓ నవ్వుతో ఇంటర్వ్యూ ముగించింది.

ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అది చూసిన వారంతా మన ఆర్జీవి ఇంటర్వ్యూలు చేసే యాంకర్ లతో తెగ పులిహార కలుపుతున్నాడు అంటూ కామెంట్స్ చేస్తూ ఆర్జీవిని ట్రోల్ చేస్తుంటే మరి కొంతమంది నీకేం స్వామి నువ్వు లైట్ తీసుకుంటావు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అని
ఆర్జీవిని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియో పై మీరు ఓ లుక్ వేయండి.

watch video:


End of Article

You may also like