వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఆయన తీసిన పవర్ స్టార్ చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.నిన్న విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది.

కాని వీటిని ఎప్పటిలాగే రాంగోపాల్ వర్మ అసలు పట్టించుకోవట్లేదు.ఈ చిత్ర ట్రైలర్ లో పవన్ కు వ్యతిరేకంగా బోలెడు ఎలిమెంట్స్ ఉన్నాయి.ఇంతకముందు ఆర్జీవి చిత్రాలలో లాగే ఇందులో పేర్లు,పాత్రలు రియాలిటికి చాలా దగ్గరగా ఉన్నాయి.

పవన్ ఫ్యాన్స్ ఆర్జీవి పై గరంగా ఉన్నారని తెలిసిన యూట్యూబ్ సాటిలైట్ ఛానల్ లు ఆయనను తిట్టడానికైన ఇంటర్వ్యూలు చూస్తారనే ఉద్దేశంతో వరుసగా ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ప్రమోషన్ దొరుకుతుంది కదా అని ఆర్జీవి వచ్చిన వాళ్ళందరికి కాదనకుండా ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు.

ఇలాంటి టైంలో కొందరు పవన్ ఫ్యాన్స్ గతంలో ప్రెస్ మీట్ సందర్భంగా పవన్ ను ఆర్జీవి పై మీ అభిప్రాయం చెప్పమని అడగగా ఆయన ఒపీనియన్ ను నేను బాగా గౌరవిస్తాను అని అన్నారు.ఆ వీడియోను పోస్ట్ చేస్తూ ఇది ఆయన అంటే ఇప్పటికైనా తెలుసుకోండి పవర్ స్టార్ అంటే ఎవరో ఆర్జీవి గారు అంటూ కామెంట్స్ పెడుతూ ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.మీరు కూడా పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్న ఆ వీడియో పై ఓ లుక్ వేయండి.
