Ads
ప్రేమించాడు, పెళ్లి చేసుకోమంటే కుదరదన్నాడు.అతని ప్రవర్తన నచ్చని అమ్మాయి తల్లిదండ్రులు . అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తే వాటిని చెడగొడుతూ అమ్మాయిని తనని మాత్రమే పెళ్లి చేసుకోవాలని లేదంటే చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా హింసించేవాడు.దానితో అతడి బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది.
Video Advertisement
వివరాలలోకి వెళ్తే సారంగాపూర్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన కొత్తపల్లి ఉమ(19) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే రోజుల్లో రంజిత్(19) ప్రేమలో పడింది. ఇంటర్ చదవు పూర్తయ్యేవరకు వారి ప్రేమ చాలా సాఫీగా సాగింది. అనంతరం ఉమ తను చదవు ఆపేసి ఇంటి వద్దే ఉంటూ బీడీలు చుడుతూ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడుతూ ఉండేది.
గత కొంతకాలంగా ఉమ మరియు ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని రంజిత్ ను అడుగుతున్నారు.అందుకు రంజిత అంగీకరించలేదు.దానితో ఉమ తల్లిదండ్రులు ఆమెకు వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారు.విషయం తెలుసుకున్న రంజిత్ ఉమకి వచ్చిన సంబంధాలు చెడగొడుతూ ఆమె తనను మాత్రమే పెళ్లి చేసుకోవాలని లేదంటే చచ్చిపోవాలి అంటూ ఆమెను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు.దీన్ని తట్టుకోలేకపోయిన ఉమ సూసైడ్ నోట్ రాసి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను వెంటనే హాస్పిటల్ కు తరలించారు.రెండు రోజుల చికిత్స అనంతరం ఆమె మరణించింది.
ఆమె దేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఉమ కుటుంబ సభ్యులకు ఒక సూసైడ్ నోట్ దొరికింది.అందులో
” అమ్మానాన్న నన్న క్షమించండి…. నేను రంజిత్ ను లవ్ చేసినందుకు వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడం లేదమ్మా…. లవ్ చేసినవ్ గా చేసుకుంటే నన్నే చేసుకోవాలి లేదంటే చచ్చిపో…అంటున్నాడు.! వాడిని పెళ్లి చేసుకొని మీకు చెడ్డపేరు తేలేను ….అలా అని మీరు చెప్పిన సంబంధం చేసుకున్నా …వాడు నన్ను హ్యాపీగా ఉండనివ్వడు…. బతికి ఉండి మీకు బాధను ఇవ్వడం తప్ప నా నుండి మీకు జరిగే మంచి ఏమీలేదు గుడ్ బై ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్” అని ఉన్నది.ఆ సూసైడ్ నోట్ తీసుకొని వెళ్ళి ఉమ తల్లిదండ్రులు రంజిత్ పై కేసు నమోదు చేశారు.దీనితో ఎస్సై రాజన్న మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి విచారణ చేపడుతున్నట్లు తెలిపారని సాక్షి కథనంలో పేర్కొన్నారు.
End of Article