విష్ణు ప్రియ చేతిపై ఆ హీరో పేరు.? టాటూ సీక్రెట్ బయటపెట్టిన శ్రీముఖి.!

విష్ణు ప్రియ చేతిపై ఆ హీరో పేరు.? టాటూ సీక్రెట్ బయటపెట్టిన శ్రీముఖి.!

by Megha Varna

Ads

తెలుగులో ప్రస్తుతం ఫిమేల్ యాంకర్స్ బోలెడు మంది ఉన్నారు.అందరిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల ఆదరణను పొందగలుగుతున్నారు.అందులో విష్ణ ప్రియ కూడా ఒకరు.ప్రస్తుతం ఆమెకు క్రేజ్ పిక్స్ లో ఉంది.అందుకే ఈమధ్య చాలా షోస్ లో గెస్ట్ గా కనిపిస్తుంది.

Video Advertisement

ఇక తాజాగా లవ్యూ జిందగి ప్రోగ్రాంలో భాగంగా
ఈ ముద్దుగుమ్మ శ్రీముఖి తో కలిసి అల్లరి చేసింది.ఈ ఇద్దరి అల్లరిని కంట్రోల్ చేసే టీచర్ గా అదేనండి హోస్ట్ గా ఝాన్సీ వ్యవహరించారు. టాస్క్ లో భాగంగా ఝాన్సీ విష్ణు ప్రియాను తన సీక్రెట్ రివిల్ చేయమని అడిగింది.ఆ ప్రశ్నకు విష్ణు ప్రియ కంటే ముందు శ్రీముఖి స్పందించింది.

 

దాని గురించి నా దగ్గర బోలెడన్ని సీక్రేట్స్ ఉన్నాయి..’ అని నవ్వింది.అందుకు ఝాన్సీ.. అవునా అయితే మాకొకటి చెప్పు అని అడిగింది. విష్ణుప్రియ ‘అమ్మా నాకు షివరింగ్ వస్తుంది తల్లీ’ అంటుంది రిక్వెస్ట్‌ చేసింది.కాని శ్రీముఖి చెప్పకుండా ఆగలేకపోయింది.అందుకే విష్ణుప్రియ లైఫ్ లోని ఓ సీక్రెట్ చెప్పేసింది.

అదేంటంటే తనకి అఖిల్ అంటే ఇష్టమని దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే తను తప్పకుండా అఖిల్ ను అడుగుతుంది అంత ఇష్టం తనకి అఖిల్ అంటే .కావాలంటే తన చేతి మీద ఉన్న టాటూ చూడండి ఒకసారి చూపించవే అని శ్రీముఖి అన్నది.

విష్ణు ప్రియ తన చేయి చూపించింది. A అండ్ విష్ణు ప్రియ అనే టాటూ చూపించింది.ఇది చూసిన ఝాన్సీ తను అష్టా చమ్మా లో స్వాతి లాగ అన్నమాట ఏది ఒకసారి ఆ డైలాగ్ చెప్పు అని అన్నది.అందుకు విష్ణు ప్రియ
‘ హా పేరులోనే ఓ మత్తుంది.. ఒక పవర్ ఉంది.. వైబ్రేషన్ ఉంది అంటూ మెలికలు తిరిగింది’ .దీనికి శ్రీముఖి,ఝాన్సీ పకపక నవ్వేశారు.


End of Article

You may also like